గీతా సింగ్ సమస్య…నిజంగా బాధాకరమే

గీతా సింగ్ సమస్య…నిజంగా బాధాకరమే

గీతాసింగ్ రాజస్థానీ అమ్మాయి. అయినా తెలుగు చక్కగా మాటట్లాడుతుంది. ఇప్పటివరకూ 80 వరకూ తెలుగు చిత్రాల్లో నటించిన ఆమెకు కెరీర్ పరంగా వెనకబడిందనే చెప్పాలి. కితకితలు సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చి, తెలుగును స్వచ్ఛంగా మాట్లాడేలా తర్ఫీదునిచ్చిన ఈవీవీకి రుణపడి ఉంటానాని చెప్తూండే ఆమె తన సమస్యలు గురించి మీడియాతో చెప్పుకుంది.

గీతా సింగ్ మాట్లాడుతూ… “ఇండస్ట్రీలో వేషాలు రాకపోతే ఒక బాధ .. వేషం వేసినా అందుకు సంబంధించిన రెమ్యునేషన్ అందకపోతే మరో బాధ.సినిమాలకి .. ఆయా ఈవెంట్లకి సంబంధించిన డబ్బులు చాలా వరకూ రావలసినవి వున్నాయి. చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా అవి రావడం లేదు. గట్టిగా డబ్బులు అడగలేననేదే వాళ్ల ఉద్దేశం.

<

p style=”text-align: justify”>ఒక ఆడపిల్ల గడపదాటి వచ్చి ఎందుకు కష్టపడి పనిచేస్తోందనే సానుభూతి కూడా చాలామందిలో కనిపించడం లేదు. ఒకే ఫీల్డులో ఉంటూ గట్టిగా అడగలేము .. మరెవరికీ ఫిర్యాదు చేయలేము” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగులో మూడు, కన్నడంలో ఒక సినిమా చేస్తున్నట్టు చెప్పారు.