మెగా కుటుంబంలోకి నాగశౌర్య ..?

అల్లు అరవింద్ తాజా సినిమాకు నాగశౌర్య ను ఎంపిక చేశారనే వార్త ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయ్యింది  . ఒక నిర్మాత ఓ యంగ్ హీరోను తీసుకోవడంలో విశేషం ఏమి ఉండదు. ఇది రొటీన్ గా జరిగేదే అనుకుంటారు . కానీ అరవింద్ నాగశౌర్య తీసుకుంటున్నాడంటే , అది నాగశౌర్య చేసిన నర్తన శాల సినిమా ప్లాప్ అయ్యిందని  తెలిసికూడా.  అందులోనే అసలు సిసలు రహస్యం దాగి ఉందని చెప్పుకుంటున్నారు . నాగ శౌర్య , చిరంజీవి తమ్ముడు నాగ బాబు కుమార్తె నిహారిణి కల్సి “ఒక మనసు” అనే సినిమాలో కలసి నటించారు . అప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్త
అప్పట్లో గుప్పుమంది . పెళ్లికూడా చేసుకోవాలను కుంటున్నారని అప్పట్ల చెప్పుకున్నారు . అయితే ఆ తరువాత   దీనికి సంబంధించి ఎలాంటి ప్రోగ్రెస్ లేదు .

నాగశౌర్య స్వంతంగా వెంకీ కుడుములు దర్శకత్వంలో “ఛలో ” అనే సినిమా నిర్మించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగా స్టార్ చిరంజీ వచ్చి నాగశౌర్యను ఆశీర్వదించాడు . ఆవేదికపై నాగశౌర్యను చిరంజీవి పొగడ్తలతో ముంచేశాడు.  అప్పుడు మళ్ళీ నాగశౌర్య , నీహారిణీ ల పెళ్లి  గురించిన ఊహాగానాలు జోరందుకున్నాయి . ఇక ప్రస్తుతానికి వస్తే , గీత గోవిందం సినిమా అరవింద్ కు  కోట్లను కురిపించింది . ఆచిత్ర దర్శకుడు పరశురాంతో ఓ చిత్రం నిర్మిస్తారని వార్త వచ్చింది . హీరో ఎవరై వుంటారు అనుకుంటున్న సమయంలో నాగశౌర్య పేరు తెరపై కి వచ్చేసింది .

ఒక ప్లాప్ సినిమా ఇచ్చిన హీరో వైపు ఎవరు కన్నెత్తి చూడరు . పైగా నాగశౌర్య స్వంత సినిమా “నర్తనశాల “. వూహించనత పరాజయం పాలయ్యింది . అల్లు అరవింద్  మాత్రం ఈ సెంటిమెంటును పక్కన పెట్టి నాగశౌర్యను ఎంపిక చేశారనే వార్త రావడంతో మళ్ళీ నాగశౌర్య, నీహారిణీ పెళ్లి వార్త ఊహాగానాలకు తెర లేసింది . నాగశౌర్యను తమ కుటుంబంలోకి ఆహ్వానించే ఆలోచన ఉంది కాబట్టే అరవింద్ నాగశౌర్యకు లైఫ్ ఇవ్వడానికే తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు .నాగశౌర్యను హీరోగా నిలబెట్టడానికే అల్లు అరవింద్ ప్లాన్ అట . నాగశౌర్య మెగా కుటుంబంలోకి వెళ్లే అవకాశం త్వరలోనే ఉందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి !