ఫస్ట్ లుక్ :‘సైరా’లో సిద్దమ్మగా నయనతార

తెల్లదొరలపై పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధునిగా చరిత్రకెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’.మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.ఈ చిత్రంలో నయన్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ తాజాగా మోషన్ టీజర్ ను విడుదల చేసింది.

Nayanthara Motion Teaser | Sye Raa Narasimha Reddy | Chiranjeevi | Ram Charan | Surender Reddy

 
ఈరోజు నయనతార పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ‘నయనతార మోషన్ టీజర్‘ను రిలీజ్ చేసింది. నయనతారకు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమాలో నయనతార పేరు ‘సిద్దమ్మ’గా ఉంటుందని వెల్లడించింది.

నయనతారకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ‘సైరా’కు ఆమె ఇచ్చిన డేట్స్ చాలా తక్కువని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ కోసం మూడు రోజుల కాల్ షీట్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ మూడు రోజుల్లోనే ఆమెకు సంబంధించిన సీన్స్‌ను సురేందర్‌రెడ్డి తెరకెక్కించారని తెలుస్తోంది.

మెగా బడ్జెట్ తో చారిత్రక నేపథ్యంలో రూపొందుతన్న ‘సైరా నరసింహారెడ్డి’లో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, నయనతార సహా పలువురు హేమాహేమీ నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.