బిగ్ బాస్ 4 : ఓపెనింగ్ రోజు హౌస్ లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వబోతున్న కపుల్ వీళ్ళే – సూపర్ పెయిర్

బిగ్ బాస్ సీజ‌న్ 4కి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ కోసం అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో వేసిన సెట్లో స‌ర్వం సిద్ధం చేశార‌ని తెలిసింది. ఇప్ప‌టికే ప‌ద‌హారు మంది పార్టిసిపెంట్స్ తాలూకా వివ‌రాల్ని తెలుగురాజ్యంలో ఎక్స్ క్లూజివ్ గా అందించాం. వీళ్లంద‌రినీ క్వారంటైన్ లో ఉంచారు. త‌గు జాగ్ర‌త్త‌ల్ని తీసుకుంటున్నారు.

first entry couple in bigboss 4
first entry couple in bigboss 4

ఎంపిక చేసిన వారిలో సెల‌బ్రిటీల‌కు కొద‌వేమీ లేదు. కొన్ని జంట‌లు కూడా ప్ర‌త్య‌క్షం కానున్నాయ‌ని.. స్పెష‌ల్ ట్రీట్ ఉంటుంద‌ని ఇదివ‌ర‌కూ వెల్ల‌డించాం. ఈసారి హౌస్ లో ప్ర‌వేశించే జంట‌ల్లో ఓ జంట మాత్రం ప్ర‌త్యేకించి హైలైట్ కానుంది. ఇంత‌కీ ఎవ‌రా జంట‌? అంటే…

రఘు మాస్టర్ – గాయ‌ని ప్ర‌ణ‌వి జోడీ. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఓపెనింగ్ రోజు హౌస్ లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వబోతున్న కపుల్ వీళ్ళే న‌ని .. సూప‌ర్ పెయిర్! కళ్లు చెదిరే ట్రీటివ్వ‌బోతోంద‌ని తాజాగా స‌మాచారం రివీలైంది. ర‌ఘు టాలీవుడ్ లో సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్. ప్ర‌ముక హీరోలంద‌రికీ కొరియోగ్ర‌ఫీ అందిస్తుంటారు. అలాగే సింగ‌ర్ ప్ర‌ణ‌వి కెరీర్ ప‌రంగా బిజీ. వీరిది ప్రేమ వివాహం. ఈ జంట ఎలాంటి ట్రీట్ ఇస్తుంద‌నేది చూడాలి. సీజ‌న్ 3కి హోస్టింగ్ చేసిన నాగార్జున నే సీజ‌న్ 4కి కూడా హోస్టింగ్ చేస్తుండ‌డం అద‌న‌పు ఆక‌ర్ష‌ణ కానుంది. దాదాపు 100 రోజుల పాటు ఈ షో స్టార్ మా వీక్ష‌కుల్ని అల‌రించ‌నుంది.