ఫిల్మ్ నుండి తప్పుకున్న రేణుదేశాయ్ ?

రేణుదేశాయ్ ఆ మధ్య దర్శకురాలిగా కూడా ప్రయత్నం చేసి సక్సెస్ కాలేకపోయారు. అయితే నటిగా బిజీ అవుతున్నారని వార్తలు వినిపించాయి. ఇటీవల రేణుదేశాయ్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందబోయే సినిమాలో కీలక పాత్రను పోషిస్తుందని వార్తలు వినిపించాయి. ఒకప్పుడు రాబిన్ హుడ్‌గా పేరు తెచ్చుకున్న సూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి టైగర్ అనే పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఓ సామాజిక కార్యకర్త పాత్రలో రేణుదేశాయ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం నుండి రేణుదేశాయ్ చేయటం లేదు అని సమాచారం. ఆమె తప్పుకోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు.