అఖిల్ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ విల‌న్ గాళ్‌ఫ్రెండ్‌

రామ్‌చ‌ర‌ణ్‌ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమా గుర్తుందా? అందులో అరవింద్ స్వామి విలన్‌. సినిమాలో ఆయనకు ప్రేయసిగా నటించిన అమ్మాయి గుర్తుందా? పేరు ఫరా కరిమీ. ఆమెది హాలండ్. ‘ధృవ’ కంటే ముందు కొన్ని హిందీ సినిమాల్లో నటించింది. ‘ధృవ’ తరవాత తెలుగులో నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో గ్రీక్ రాకుమారిగా కనిపించింది. ఇప్పుడీ అమ్మాయి ప్రస్తావన ఎందుకంటే మరో తెలుగు సినిమాలో నటిస్తుందీమె.అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్‌ ప్రసాద్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఫరా కరిమీ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. అదేనండీ… ఐటమ్ సాంగ్ చేయనుంది. త్వరలో ఈ సాంగ్ షూటింగ్ చేయనున్నారు. ప్రజెంట్ తమన్నా, కాజల్ వంటి టాప్ హీరోయిన్లు ఐటమ్ సాంగులు చేస్తున్నారు. ప్రేక్షకులకు పెద్దగా తెలిసిన ముఖాలు కాకుండా కొత్త ఫేస్ అయితే సాంగ్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని భావించిన వెంకీ అట్లూరి ఫరా కరిమీని సెలెక్ట్ చేశాడట. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ లండన్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్.