సమంత అక్కినేని నటించిన ‘ఓ బేబి’ మూవీ రేపు (ఈనెల 5వ తేదీన) విడుదల కాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్లలోనూ సమంత బాగా యాక్టివ్ గా పాల్గొంటోంది. ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి 70 ఎంఎం ముందు ఈ భారీ కటౌట్ ఏర్పాటుచేశారు అభిమానులు.ఈ కటౌట్ గురించి మీడియాలో వార్తలు వచ్చాయి.
Hii @Samanthaprabhu2 , my friend wants to use this for his gym as advertisement Cutout…😂😂😂
With some editing with muscle🙄🙄😋😋😂😂… What u say, he is your diehard fan and running gym in our town…😃😃#OHBaby! pic.twitter.com/5pGO2YCHWg— Mahi (@simply_arm) July 4, 2019
ఈ నేపధ్యంలో సమంత కండల కటౌట్, ఇప్పుడు అందరినీ ఎట్రాక్ట్ చేస్తూండగా సోషల్ మీడియాలో ఈ కటౌట్ పై ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. తన స్నేహితుడు ఈ కటౌట్ ను తన జిమ్ కు యాడ్ లా వాడుకోవాలని భావిస్తున్నాడని, మీ కటౌట్ ను కొద్దిగా మార్చి కండలు కనిపించేలా చేశాడని చెప్పిన ఓ నెటిజన్ ట్వీట్ పై సమంత కూడా స్పందించింది. “బేబీ ఆన్ స్టెరాయిడ్స్” అని సమాధానం ఇచ్చింది.
సమంత అక్కినేని, నందినీ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం `ఓ బేబి` . సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మి కూడా కీలక పాత్రలో నటించారు.
ఈ చిత్రంలో లక్ష్మి, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, ప్రగతి రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక వర్గం: మ్యూజిక్: మిక్కి జె.మేయర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్ , డైలాగ్స్: లక్ష్మీ భూపాల్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ , డిజైన్:జయశ్రీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యువు థామస్ కిమ్ ,ఆర్ట్: విఠల్.కె, దర్శకత్వం: బి.వి.నందినీ రెడ్డి, నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్, సహ నిర్మాతలు: విజయ్ దొంకాడ, దివ్యా విజయ్.