వెంకటేశ్, వరుణ్‌తేజ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘f2’.జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 11న అమెరికాలో సినిమా ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్ల పాత్రల్లో సందడి చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తూంటే పూర్తి ఎంటర్ట్నైమెంట్ ని నమ్ముకుని సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే డైలాగులు చాలా వెటకారంగా రాసారని తెలుస్తోంది.
ట్రైలర్ మొదట్లోనే .. ‘చివరిగా నవ్వుకుని తాళికట్టు నాయనా..’ అని పురోహితుడు అనడంతో పెళ్లి పీటలపై కూర్చుని ఉన్న వెంకటేశ్ షాక్‌తో చూసే సీన్ అదిరింది. కోపంతో మండిపడే భార్య తమన్నాకు భర్తగా వెంకీ బాగా నవ్విస్తున్నారు. ఆయన కామెడీ టైమింగ్ చాలా రోజుల తర్వాత మళ్లీ చూడగలుగుతున్నారు అభిమానులు.
వరుణ్ తేజ కూడా మెహరీన్‌ను ఇంప్రెస్ చేయడానికి కష్టపడుతూ కనిపించారు. ‘మజాక్ చేస్తున్నావా?’ అని వెంకీని వరుణ్ అడిగితే.. ‘నవ్వేమన్నా నా తోడల్లుడివా?, మజాక్ చేయడానికి’ అని వెంకీ అన్నారు. ‘కాలం కలిసి వస్తే అవుతానేమో..’ అని వరుణ్ సమాధానం ఇచ్చారు. ఇలా ఫన్ గా సాగే సీన్స్, డైలాగ్స్‌తో ట్రైలర్‌ను చక్కగా రూపొందించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. ఇందులో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్ నటించారు.