మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ మహానటితో మార్కెట్ వచ్చేసింది. అంతకు ముందే మణిరత్నం దర్శకత్వంలో ఓకే బంగారం అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఇక్కడ బాగానే ఆడింది. ఆ తర్వాత హే పిల్లగాడా వంటి ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు సైతం దుల్కర్ కు ప్లస్ అయ్యాయి. దాంతో దుల్కర్ తో తెలుగులో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు.
మళయాళ,తెలుగు,తమిళ లాంగ్వేజ్ లలో ఆ చిత్రం వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. అందుకోసం దర్శకుడుగా ఇంద్రగంటి మోహన్ కృష్ట సీన్ లోకి వచ్చారు. అయితే ఈ సినిమాలో మరో హీరోగా నాని కనిపించనున్నారు. దుల్కర్ కు నాని ఇంతకు ముందే చిన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. అదేమిటంటే..దుల్కర్ చేసిన ఓకే బంగారం సినిమాకు తెలుగు డబ్బింగ్ నాని చెప్పారు. ఇక వీళ్లద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే తెలుగులోనూ బాగానే పే చేస్తుందని భావిస్తున్నారు.
డైరక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమా అంటే నాని కూడా మారు మాట్లాడకుండా డేట్స్ ఇచ్చేసారు. అయితే దుల్కర్ డేట్సే ఇంకా సెట్ కాలేదట. దిల్ రాజు ఆ డేట్స్ పట్టుకునే పనిలో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్.