రెహ్మాన్ కు స్ఫూర్తి ఎవరో తెలుసా ?

జీవితం ఎప్పుడు ఏ ములుగు తిరుగుతుందో తెలియదు . “అనుకున్నామని  జరగవు  అన్నీ , అనుకోలేదని ఆగవు కొన్ని ” అనే సినిమా గీతం అనుభవం నుంచి పుట్టిందే . మన ఏదైతే అనుకుంటామో , ఏ  రకంగా మన జీవితం సాగాలని  కోరుకుంటామో …  అలా జరిగితే … అది అద్భుతమే .

భారతీయ సినిమా రంగాన్ని విశేషంగా తన సంగీతంతో ప్రభావితం చేసిన వాడు ఏ .ఆర్ . రెహ్మాన్ పువ్వు   పుట్టగానే పరిమళిస్తుంది అంటారే బహుశా అది రెహ్మాన్  లాంటి వారిని  చూసే అని వుంటారు . ఈ ఉపోద్ఘాతం  ఎందుకేనేగా ? శనివారం నాడు రజినీకాంత హీరోగా శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీగా నిర్మించిన “2 ఓ ” చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ చెన్నై లో జరిగింది .

ఈ సందర్భగా రెహ్మాన్  మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో “తాను  సంగీత దర్శకుడుగా విరమించుకొని విశ్రాంతి  తీసుకోవాలనుకున్నా , అదే సమయంలో రజని సార్ “రోబో ” సినిమా చేస్తున్నాడని విన్నా, అది చాలా క్లిష్టమైన సినిమా. ఆ వయసులో రజని సార్  కష్ట  పడుతుంటే నేను విశ్రాంతి తీసుకోవడం ఏమిటి ? అనిపించింది .అంతే సంగీతానికి దూరం కావద్దు అని నిర్ణయించుకున్నా ” అని చెప్పాడు .

నిజమే కొందరి మాటలు స్ఫూర్తి నిస్తాయి . మరి కొందరి పనులే ఆదర్శంగా , మార్గదర్శకంగా నిలుస్తాయి . మొత్తానికి రజని కాంత్  తన మెస్మరిజాన్ని రెహ్మాన్ పై  ప్రయోగించాడు . రెహ్మాన్ లాంటి అంతర్జాతీయ సంగీత దర్శకుడు  సంగీత వాయిద్యాలు పక్కన పడేయ కుండా ఉత్తమోత్తమ సంగీతాన్ని అందిస్తున్నాడు .