మహేష్ “సర్కారు వారి పాట” కి డిజాస్టరస్ టీఆర్పీ రేటింగ్..!

Sarkaru Vaari Paata Movie Review

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట”. వరుసగా ఒకదాన్ని మించి ఒకటి భారీ హిట్స్ మహేష్ ఖాతాలో పాడగా హ్యాట్రిక్ సినిమాల తర్వాత మహేష్ చేసిన సినిమా ఇది కావడం అందులోని ఒక కమర్షియల్ సబ్జెక్టు గా దర్శకుడు పరశురామ్ పెట్ల దీనిని ప్లాన్ చెయ్యడంతో భారీ హైప్ అప్పుడు నెలకొంది.

మరి ఆ అంచనాల్లోనే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం భారీ వసూళ్లతో మహేష్ కెరీర్ లో మరో 200 కోట్ల గ్రాస్ అందుకున్న చిత్రంగా ఇది నిలిచింది. మరి బాక్సాఫీస్ పరంగా బాగానే రాణించిన ఈ చిత్రం బుల్లితెర మీద మాత్రం డిజాస్టర్ అయ్యిందని చెప్పాలి.

ఈ చిత్రాన్ని మొట్ట మొదటిసారిగా స్టార్ మా ఛానెల్లో గత వారం కి ముందు వరల్డ్ ప్రీమియర్ ఫా టెలికాస్ట్ చెయ్యగా దానికి కేవలం 9.45 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది అట. దీనితో ఈ చిత్రం అయితే షాకింగ్ రేటింగ్ అందుకుండానే చెప్పాలి.

అలాగే మహేష్ నటించిన లాస్ట్ సినిమా సర్కారు వారి పాట కి ఆల్ టైం రికార్డు రేటింగ్ వచ్చింది. కానీ దీనికి ఇంత తక్కువ రావడం గమనార్హం. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం ఇచ్చాడు అలాగే హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది.