మహేష్ పై పూరి ఫైరింగ్ ఆ లెవల్లో
`ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ టాక్ తో పూరి టోన్ మారింది. ఈ సినిమా తొలి వీకెండ్ నాటికే పెట్టిన పెట్టుబడులు తిరిగి తెచ్చేస్తుందన్న పాజిటివ్ టాక్ నడుమ దర్శకుడు పూరి జగన్నాథ్ లో జోష్ పెరిగినట్టే కనిపిస్తోంది. ఈ జోష్‌లో మహేష్ పై అతడు విసిరిన ఓ పంచ్ అంతే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికిప్పుడు సక్సెస్ నేపథ్యంలో మిమ్మల్ని పిలిచి మహేష్ సినిమా చేస్తానంటే రెడీనా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే అందుకు పూరి ఇచ్చిన సమాధానం షాకిచ్చింది.
నాకంటూ ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మహేష్ తో సినిమా చేయాలన్న ఆసక్తి అస్సలు లేదు! అని తెగేసి చెప్పేశాడు. ఆ మాట చెప్పేప్పుడు పూరి కాస్తంత స్వరం పెంచి కోపంగానే కనిపించాడు. టెంపర్ తర్వాత వరుసగా అరడజను ఫ్లాపులు పూరి గ్రాఫ్ ని పూర్తిగా కిందికి దించేశాయి. దీంతో పూరి చాలానే వేదన అనుభవించాడు. ఓ వైపు స్టార్ హీరోలకు కథలు వినిపిస్తుంటే విని ఓకే అన్న వాళ్లే కానీ చేస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాళ్లు లేరు. అప్పట్లో మహేష్ హీరోగా `జనగనమన` చిత్రాన్ని పూరి ప్రకటించాడు. ఇక సెట్స్ కెళుతుంది అనుకున్న టైమ్ లో మహేష్ పెద్ద ఝలక్ ఇచ్చాడు. అందుకే అది పూరి మనసులో పెట్టుకుని ఇంత మాటన్నాడా? సూపర్ స్టార్ మహేష్ కాల్షీట్లు ఇస్తానన్నా వద్దని అంటాడా? అంటూ ప్రస్తుతం వాడి వేడిగా ముచ్చటించుకుంటున్నారు.
మహేష్‌పై పూరీకి అంత మంట!?
తన ఫ్యాన్స్ కి ఉన్న నమ్మకం కూడా నాపై ఉంచలేదని మహేష్ ని సూటిగానే అడిగేశాడు పూరి. మహేష్ ఫ్యాన్స్ ప్రతిసారీ అడిగేవారు. తనతో సినిమా ఎప్పుడు? అని .. అభిమానులు చూపించిన కాన్ఫిడెన్స్ కూడా మహేష్ కి నాపై లేదు. నేను ఫ్లాపుల్లో ఉన్నా మహేష్ అభిమానులు నన్ను నమ్మారు. అయినా ఫ్యాన్స్ కి ఓ సంగతి తెలీదు. మహేష్ ఓన్లీ హిట్టిచ్చిన దర్శకులతోనే సినిమాలు చేస్తారు. ఎవరైనా ఓ మంచి దర్శకుడు ఫ్లాపులతో వెనకబడితే వారితో అస్సలు సినిమా చేయడు! అంటూ కాస్తంత కోపంగానే మాట్లాడాడు పూరి. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ పూరీలో అంత జోష్ నింపిందన్నమాట. ఇక ఈ ఊపులో మహేష్ కి ధీటైన స్టార్ హీరోల్ని లైన్ లో పెడతాడేమో చూడాలి.