బ్రేకింగ్: ’96’ రీమేక్ కు హీరో,హీరోయిన్ లాక్

గత కొంతకాలంగా మీడియాలో నలుగుతున్న అంశం…దిల్ రాజు కు హీరో సెట్ కావటం లేదనేది. దిల్ రాజు వంటి ఇండస్ట్రీని శాసించే నిర్మాతకు హీరో సెట్ కాకపోవటమేంటనేది అందరిలో ఆసక్తిరేపిన అంశం. ఆయన తమిళంలో విజయవంతమైన 96 రైట్స్ తీసుకోవటం..అందులో హీరో కోసం అన్వేషించటం గత కొద్ది రోజులుగా జరుగుతోంది.

ముందు నాని అన్నారు. తర్వాత అల్లు అర్జున్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకువద్దామని దిల్ రాజు చాలా ప్రయత్నం చేసాడు. మొదట ఓకే అనుకున్నా..తర్వాత బన్ని వెనకడుగు వేసాడట. దాంతో చాలా మంది హీరోలను అనుకుని ఫైనల్ గా గోపిచంద్ దగ్గర ఆగినా ఫలితం లేకుండాపోయింది. చివరకు శర్వానంద్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. సమంత ని హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. ఈ కాంబోతో ఖచ్చితంగా ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైపోయింది.

తమిళం లో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో త్రిష .. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవి ’96’ అక్టోబర్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియాన్స్ ని ఫిదా చేయడమే కాదు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 1996 కాలంలో జరిగిన ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.