కేసీఆర్ సార్.. దిల్ రాజు, అల్లు అరవింద్‌లను షూట్ చేయాలి అంటూ రీసెంట్ గా ‘పేట’నిర్మాత ఫైర్ అవుతూ చేసిన ప్రసంగం సంచలనమే సృష్టించింది. మీడియా మొత్తం హైలెట్ చేసింది. అయితే ఆయన ఎమోషనల్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ అందరికీ మండుకొచ్చింది. దిల్ రాజు ఇప్పటికే ఈ విషయమై స్పందించారు.
అంతేకాకుండా పేట రిలీజ్ కోసం పెట్టుకున్న హైదరాబాద్ లోని సుదర్శన్ థియోటర్,ఆర్టీసి క్రాస్ రోడ్ థియోటర్స్ ని సైతం కాన్సిల్ చేసారని సమాచారం. ఇంకా నైజాంలో మరికొన్ని థియోటర్స్ సైతం కాన్సిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేస్తారా లేదా అన్న విషయం డైలమోలో పడింది.
వల్లభనేని అశోక్ ఏమన్నారు..
ఈ సినిమా విడుదలకు థియేటర్స్ విషయంలో ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. యువీ క్రియేషన్స్ కానివ్వండి.. అల్లు అరవింద్ కానివ్వండి.. దిల్ రాజు కానివ్వండి.. వీళ్లంతా థియేటర్స్‌తోనే వీళ్లు పుట్టినట్టుగా థియేటర్స్ ఇవ్వడానికి వీళ్లకేంటి నొప్పి. ఇక్కడ కేసీఆర్ కావచ్చు. అక్కడ చంద్రబాబు కావచ్చు. ఇలాంటి కుక్కలకు బుద్ది చెప్పాలి. వారి బుద్ది చెప్పి థియేటర్ మాఫియాని కడిగేయాలి. ఎవరో నయీంని చంపేసి ఎంతో మందికి మేలు చేశారు కేసీఆర్. ఇలా థియేటర్ మాఫియా ఉన్న వాళ్లని ఎందుకు షూట్ చేయరు అంటూ ఆవేశ పూరితంగా ప్రసంగం చేసారు అశోక్ వల్లభనేని.
దిల్ రాజు కౌంటర్
అశోక్ వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు.. .. సంక్రాంతికి తెలుగు నుంచి 3 పెద్ద సినిమాలు విడుదలవుతుంటే అనువాద చిత్రానికి ధియేటర్లు ఎలా దొరుకుతాయని ప్రశ్నించారు. తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి నెలకొందన్నారు. గతేడాది పంపిణీదారుడిగా చాలా డబ్బులు పోగొట్టుకున్నానని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమాల విడుదల తేదీలను ఆరు నెలల ముందే ప్రకటించినట్టు తెలిపారు. అశోక్ అనుచితంగా మాట్లాడటం సరైంది కాదని అన్నారు.