భార‌తీయుడు 2లో యాక్ష‌న్ దేవ‌గ‌న్ లేన‌ట్టేనా?

`భార‌తీయుడు-2`లో మిస్ట‌ర్ ఇండియా!

స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ వారికి వ్య‌తిరేకంగా పోరాడిన ఓ ఫ్రీడ‌మ్ ఫ్రైట‌ర్ స్వ‌తంత్ర‌ దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న లంచ‌గొండి త‌నంపై సాగించిన స‌మ‌రం నేప‌థ్యంలో వ‌చ్చిన చిత్రం `ఇండియ‌న్‌`. తెలుగులో `భార‌తీయుడు` పేరుతో రూపొంది సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఆ చిత్రానికి సీక్వెల్‌గా శంక‌ర్ `ఇండియ‌న్‌-2`(భార‌తీయుడు 2)ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ మ‌రోసారి సేనాధిప‌తి పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే ఏపీలో మొద‌లైంది. త‌దుప‌రి షెడ్యూల్‌ని త‌మిళ‌నాడులోని శ్రీ పెరంబుదూర్‌లో చేయ‌బోతున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో విల‌న్‌గా బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్‌గ‌న్ న‌టిస్తున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ ప్ర‌చారంలో నిజం లేద‌ని, అజ‌య్‌దేవ్‌గ‌న్ స్థానంలో విల‌న్‌గా మిస్ట‌ర్ ఇండియా అనిల్ క‌పూర్ న‌టిస్తున్నాడ‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ హీరో అనిల్ క‌పూర్‌ని  సంప్ర‌దించారు. దీంతో సోష‌ల్ మీడియాలో జ‌రుగులున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చారు. వీరిద్ద‌రు క‌ల‌సి మాట్లాడుకున్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.
 
ఇటీవ‌లే చెన్నై వ‌చ్చిన అనిల్ క‌పూర్ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ని క‌లిశార‌ట‌. ఆ స‌మ‌యంలోనే త‌న పాత్ర తీరు తెన్నుల గురించి ఆరాతీశార‌ని, ఈ వారంలోనే అనిల్ క‌పూర్ సెట్స్‌లో పాల్గొంటార‌ని తాజా స‌మాచారం. కెరీర్ తొలి నాళ్ల‌లో తెలుగు చిత్రంలో న‌టించి ఆ త‌రువాత ద‌క్షిణాది చిత్రాల వైపు చూడ‌ని అనిల్ సుధీర్ఘ విరామం త‌రువాత తొలి సారి త‌మిళ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం కొత్త‌గా వుంద‌ని, ఇండియ‌న్ సినిమాలో మారుతున్న స‌మీక‌ర‌ణాల‌కు ఇది నిద‌ర్శ‌నంగా నిల‌వ‌బోతోంద‌ని ఫిల్మ్ మేక‌ర్స్ చెప్పుకుంటున్నారు.