నాగ్, నాని ‘దేవదాస్‌’ టాక్ ఏంటి

అక్కినేని నాగార్జున , నాని హీరోలుగా నటించిన చిత్రం ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వని దత్‌ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. సెప్టెంబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. యుఎస్ లో అయితే టాక్ కూడా బయిటకు వచ్చేసింది.

యుఎస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జస్ట్ ఓకే. కేవలం నాని, నాగార్జున అనే కాంబినేషన్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ ఏమీ లేవు. హాలీవుడ్ చిత్రం ఎనలైజ్ దిస్ కు ఓ పూర్ కాపీగా ఇది రూపొందింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడు నాని, నాగార్జున మధ్య వచ్చే సీన్స్ బాగా రాసుకున్నాడని అవే ఉన్నంతలో సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్తున్నారు.

స్క్రిప్టు మరింత టైట్ గా ఉంటే సినిమా బాగుండేదని,పాటలు కూడా  రెండు మాత్రమే బాగున్నాయని ,మిగతావి సోసో గా ఉన్నాయని చెప్తున్నారు. మొదట 15 నిముషాలు, సెకండాఫ్ లో చాలా చోట్ల బోర్ కొట్టిందని..నాని టైప్ కామెడీని ఎక్సపెక్ట్ చేసి వచ్చేవారికి పెద్దగా నచ్చదని అంటున్నారు.  అయితే కాలక్షేపానికి ఈ వారాంతంలో ఈ సినిమాని ఎంచుకోవచ్చు అని..కొంతమంది చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఎలాగో ఫెరఫెక్ట్ రివ్యూ వస్తుంది కాబట్టి అప్పుడు జెన్యూన్ టాక్ ఏంటో చూద్దాం.