ఈ సారైనా నాగ్ కు ఈ గెటప్ కలిసొస్తుందా?

నాగార్జున మాఫియా డాన్ గా నటించిన డాన్, భాయ్ సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. మన్మధుడుగా నాగ్ ని చూసిన కళ్లతో హత్యలు, దందాలు చేసుకునే మాఫియాకు డాన్ గా చూడాలంటే కాస్త కష్టమే అనిపించింది. దాంతో డాన్ గా చేసిన ఆ రెండు సినిమాలను త్రిప్రికొట్టారు.

అప్పట్లో అంటే శివ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన రోజుల్లోనూ నాగ్ ..అదే వర్మతో చేసిన మాఫియా సబ్జెక్టు అంతం కూడా అంతులేకుండా పోయింది. అయినా నాగ్ కు ఆ పాత్రపై మోజు పోలేదు. అందుకేనేమో మరోసారి మాఫియా డాన్ గా కనపడుతూ..తోడుగా నవ్వించటానికి నాని ని వెంటతెచ్చుకుని మరీ దేవ దాసు అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

“అంతా భ్రాంతియేనా..” పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటే నాని తన క్లినిక్ లో దిగాలుగా ఉండగా ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది.   నెక్స్ట్ షాట్ లో నానిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పోతారు.  ఇక అలా ఎందుకు జరిగింది అనే సస్పెన్స్..తో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.

 అలాగే ఫన్నీ మూవ్ మెంట్స్ మాత్రమే కాక… ఈ ట్రైలర్ లో ..సీరియస్ మాఫియా యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. నాగ్ లెఫ్ట్ హ్యాండ్ తో గన్ ని స్టైల్ గా తిప్పుతూ చేసే యాక్షన్ ఫ్యాన్స్ చేత గోల చేయిస్తాయి.  పాత నాగ్ గుర్తు వస్తున్నాడు. ఈ డాన్ హిట్ కొట్టేటట్లు ఉన్నాడు.

దేవదాసు  ట్రైలర్