కర్ణాటకలో “డియర్ కామ్రేడ్ “కు ఊహించని దెబ్బ
“డియర్ కామ్రేడ్” సినిమా ఈరోజే ప్రపంచమంతా విడుదలైంది . అయితే సినిమా ఎలా వుంది అంటే అంత ఆశాజనకంగా లేదు అంటున్నారు . గీత గోవిందం తరువాత విజయ్ , రష్మిక చేస్తున్న “డియర్ కామ్రేడ్ ” సినిమా పై అందరి దృష్టి వుంది . భరత్ కమ్మ దర్శకత్వలో ఈ సినిమాను మైత్రీ మూవీస్ వారు నిర్మించారు . సినిమా కు ఆశించిన స్థాయిలో రిపోర్ట్ రాకపోగా ఇప్పడు కర్ణాటక నుంచి ఊహించని షాక్ వచ్చింది . అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను దుమ్మెత్తి పోస్తున్నారు . దీన్ని కర్ణాటకలో బ్యాన్ చేయవలసిందే అంటూ నినదిస్తున్నారు . సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు .
” డియర్ కామ్రేడ్ ” సినిమాను తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో డబ్ చేసి శుక్రవారం రోజు అక్కడ విడుదల చేశారు . అయితే మిగతా రెండు రాష్ట్రాలైన తమిళ నందు , కేరళ నుంచి రాని అభ్యన్తరాలు ఒక్క కర్ణాటక నుంచే ఎందుకు వస్తున్నాయి ?. కన్నడంలో సినిమాను విడుదల చేసిన తరువాత కూడా వీరు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పైగా రష్మిక మందన్న కన్నడ అమ్మాయి . దీనికి ప్రధాన కారణం కన్నడంలో దబ్ చేసిన థియేటర్ ల కన్నా తెలుగు వెర్షన్ కె ఎక్కువ థియేటర్లు కేటాయించడం . దీనిని అవమానంగా కన్నడిగులు భావిస్తున్నారు .
కన్నడంలో ఐదు థియేటర్ లలో 8 షోలు మాత్రమే బెంగళూరు నగరంలో ప్రదర్శిస్తూ ఉండగా , అదే తెలుగు సినిమా 65 థియేటర్లలో 250 షోలు ప్రదర్శిస్తున్నట్టు వీరు తెలిపారు . కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ కన్నడ డబ్బింగ్ సినిమాను ప్రదర్శించకుండా తెలుగు ను ప్రదశించడంపై కన్నడ సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు . డియర్ కామ్రేడ్ తెలుగు సినిమా ను చూడవద్దని చెబుతున్నారు . తమ మీద బలవంతంగా తెలుగు చిత్రాలను రుద్దితే సహించమని హెచ్చరిస్తున్నారు . ఈ రకమైన చిత్రాలను కర్ణాటక రాష్ట్రంలో అనుమతిస్తున్నందుకు కన్నడ చిత్ర పరిశ్రమ ను కూడా వీరు విమర్శిస్తున్నారు .