న్యూడ్ ఫొటోలు పంపి షాక్ ఇచ్చిన సింగర్ చిన్మయి

గత కొంతకాలంగా చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యగా మీటూ అంటూ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను వెలుగులోకి తెచ్చింది. అందులో భాగంగా ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేయడంతో చిన్మయి హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు తమిళ ఇండస్ట్రీ నుండి బ్యాన్ కూడా ఎదుర్కొంది.

ఎప్పుడైతే వైరముత్తుతో వైరం పెట్టుకుందో అప్పటి నుండి సోషల్ మీడియాలో చిన్మయికి వేధింపులు మొదలయ్యాయి. రీసెంట్ గా తాజాగా ఓ నెటిజన్ ‘‘నీ న్యూడ్ ఫొటోలు పంపు’’ అంటూ ట్వీట్ చేసారు. అయితే ఇలాంటి ట్వీట్ లకు చెప్పుతో కొట్టినట్లు రిప్లై ఇవ్వటంలో ఆమె పండిపోయింది. ‘ఇవిగో ఇవే నా ఫేవరెట్‌ న్యూడ్స్‌’ ఫొటోలను పంపింది. ఆమె ఏం ఫొటోలు పంపిందో చూడండి.

ఇంతకీ ఆ ఫొటోలు..న్యూడ్ పిక్స్ అనే బ్రాండ్‌కి సంబంధించినవి. అక్కడితో ఆగకుండా ఈ సంభాషణను స్క్రీన్స్ షాట్స్ తీసి.. ‘ఎంటర్‌టైన్ మెంట్ కోసం’ అంటూ వాటిని షేర్ చేశారు.