ఫోర్జ‌రీ సంత‌కంతో సినిమాటోగ్రాఫర్‌కి బెయిల్?

కేసు రివైండ్: మ‌ళ్లీ బుక్క‌యిన సినీప్ర‌ముఖుడు!!

సినిమాటోగ్రాఫ‌ర్ ఛోటా.కె నాయుడు సోద‌రుడు ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ .కె.నాయుడు వివాదం గురించి తెలిసిందే. న‌టి సుధ‌తో అత‌డు గ‌త ఐదేళ్లుగా ప్రేమాయ‌ణం సాగించి ఇటీవ‌లే బ్రేకప్ చెప్పేయ‌డంతో అది కాస్తా వివాదంగా మారింది. న‌టి సుధ అత‌డిపై చీటింగ్ కేసును న‌మోదు చేసింది. అత‌డిని న‌మ్మి స‌ర్వం అర్పించుకుంటే మోసం చేశాడు అనేది ఆమె ఆరోప‌ణ‌.

ఈ కేసులో శ్యామ్.కె నాయుడుని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి పంప‌గా.. అత‌డు కేవ‌లం రెండ్రోజుల్లోనే బెయిల్ పై ఇంటికి వ‌చ్చేశాడు. అయితే అత‌డు బెయిల్ కోసం న‌టి సుధ సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేశాడ‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు సుధ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బెయిల్ కోసం తాము రాజీకి వ‌చ్చిన‌ట్టు ఓ ప‌త్రాన్ని సృష్టించి అందులో త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి మార్ఫింగ్ చేశాడ‌ని సుధ ఆరోపించారు. దీంతో పోలీసులు తిరిగి ఈ కేసును తిర‌గ‌తోడార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బెయిల్ ర‌ద్ద‌య్యింది. శ్యామ్ ని తిరిగి జైలుకి త‌ర‌లించే వీలుంద‌ని తెలుస్తోంది.

శ్యామ్.కె.నాయుడు అంటే పాపుల‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్. పూరి ఆస్థాన సినిమాటోగ్రాఫ‌ర్. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌ని చేసి అన్న‌ను మించిన ప్ర‌తిభావంతుడు అని నిరూపించుకున్నాడు. ఇక ఈ వివాదంలో ఛోటా.కె నాయుడు రాజీ ప‌రిష్కారం కోసం చాలానే ప్ర‌య‌త్నించినా ఏదీ కుద‌ర‌లేదని తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=S6B-6OgEysE