చియాన్ అంత బుల్లి చియాన్ ఎద‌గాలంటే?

తండ్రి కొడుకులు హ‌త్య‌లు చేస్తారా?

నిజ జీవితంలో తండ్రి-కొడుకు ద్వయం ఒక సినిమాలో ఒకే త‌ర‌హా పాత్రలు పోషిస్తే అది అభిమానుల‌కు ట్రీట్ లాంటిదే. తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ తో క‌లిసి ఆయ‌న‌ కుమారుడు ధ్రువ్ విక్రమ్ తన రెండవ చిత్రానికి సంతకం చేశారు. అంతేకాదు ధ్రువ్ తన తండ్రితో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

ఈ చిత్ర పోస్టర్‌ను ధ్రువ్ విక్రమ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పోస్టర్ లో రెండు చేతుల మ‌త‌ల‌బు ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచింది. పోస్ట‌ర్ లో ఒక‌ వ్యక్తి తుపాకీని పట్టుకొని క‌నిపిస్తున్నాడు. రక్తస్రావం అవుతోంది. చియాన్ ఆ తుపాకీని తన కొడుక్కి ఇస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. అంటే ఇదో క్రైమ్ డ్రామా. ఇందులో తండ్రీ కొడుకులు క‌లిసి ప‌థ‌కం వేసి హ‌త్య‌లు చేస్తారా? అన్న సందిగ్ధం క‌ల‌గ‌క మాన‌దు.

ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌ చిత్రాలను చూడటానికి తాను ఎప్పుడూ ఉత్సాహంగా ఉన్నానని ధ్రువ్ అభిమానాన్ని వెల్ల‌గ‌క్కాడు. ధ్రువ్ తనను తన తండ్రి విక్రమ్ యొక్క అతిపెద్ద అభిమాని. త‌న క‌ల నెర‌వేరుతోంద‌ని తెలిపాడు. ఇక‌పోతే తాజాగా తండ్రి కొడుకుల‌కు సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. ఈ పోస్ట‌ర్ విక్ర‌మ్- ధ్రువ్ ముఖాల‌తో ఆద్యంతం ఆక‌ట్టుకుంది.