ప్రస్తుతం ఇది సోషల్ మీడియా కాలం. రికార్డులైనా, స్టామినా అయినా, క్రేజ్ అయినా సరే సోషల్ మీడియా ఖాతాల ద్వారానే క్రియేట్ చేయాల్సి వస్తోంది. అయితే నాటి తరం హీరోలు సోషల్ మీడియా పరంగా కాస్త వెనుకబడ్డారు. ఫాలోవర్స్ విషయంలో సీనియర్ హీరోలు కుర్ర హీరోలతో పోటీపడలేకపోతున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు.
మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య నిత్యం సోషల్ మీడియా రికార్డుల విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు పరితపిస్తుంటారు. అందుకు మహేష్ బర్త్ డేన 61 మిలియన్ల ట్వీట్లతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడ్వాన్స్ బర్త్ డే కామన్ డీపీతో 65 మిలియన్ల ట్వీట్లు చేసి మహేష్ రికార్డును చెరిపేసి వరల్డ్ రికార్డును కొట్టారు.
అదే క్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ కూడా రెడీ అయ్యారు. ఎంతో ఘనంగా కామన్ హ్యాష్ ట్యాగ్‌ను, కామన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆగస్ట్ 21 సాయంత్రం ఆరుగంటల నుంచి ఆగస్ట్ 22న సాయంత్రం ఆరుగంటలకు వరకు ట్విట్టర్‌లో యుద్దం చేశారు. ఇంతా చేస్తే మొత్తం 24 గంటల్లో 2.6మిలియన్ ట్వీట్లు మాత్రమే చేయగలిగారు. దీంతో చిరంజీవికి సోషల్ మీడియాలో ఉన్న స్టామినాపై అందరికీ అనుమానం వచ్చింది. పవన్ ఫ్యాన్స్ చిరంజీవిని లైట్ తీసుకున్నారని దీన్ని బట్టి చెప్పవచ్చు. ఓరకంగా ఇది చిరుకు ఘోరమైన అవమానమే.