వైరల్ : పవన్ పై చిరంజీవి నుంచి ఒక ఎమోషనల్ బర్త్ డే విషెస్.!

టాలీవుడ్ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. మరి పవన్ పుట్టినరోజు ఈరోజు కావడంతో అభిమానులు చాలా గ్రాండ్ గా ఈ వేడుకలు చేస్తున్నారు.

అయితే ఇలాంటి తారల పుట్టినరోజులు వస్తున్నాయి అంటే డెఫినెట్ గా ఇతర హీరోస్ నుంచి విషెస్ తప్పకుండ వస్తాయి. మరి వాటిలో పవన్ పెద్ద సోదరుడు తెలుగు సినిమా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి పవన్ పై ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మరియు ఎమోషనల్ విషెస్ ని తెలియజేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి మెగాస్టార్ ఏమని చెప్పారంటే.. “తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.”

అని మెగాస్టార్ ఈ గ్రాండ్ విషెస్ ని తెలియజేసారు. దీనితో పొలిటికల్ గా కూడా పవన్ వెంటే చిరు ఉన్నారని చెప్పడానికి ఇది కూడా ఓ నిదర్శనం అని అభిమానులు అంటున్నారు. అలాగే ఈ పోస్ట్ తో పవన్ పుట్టినరోజు మరింత స్పెషల్ గా మారగా ఇద్దరి హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.