‘సైరా’లో చిరు డ్యూయిల్ రోల్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయిల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం.

ఏమిటా డ్యూయిల్ రోల్స్?

చరిత్ర ప్రకారం… ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణించాక ఆయన బాధ్యతలను మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వీకరించి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. సినిమాలో ఆ విషయం కూడా చూపించనున్నారు. ప్రీ క్లైమాక్స్ లో ఆ విషయం ప్రస్తావన వస్తుంది.

దాంతో ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను కూడా చూపించనున్నారని.. ఆ పాత్రలో కూడా చిరుయే నటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మేకప్ టెస్ట్ చేసి , ఓకే చేసారని చెప్తున్నారు. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏమీ రాదు.

ఇక ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ ఏంటంటే.. ‘సైరా’ నెక్ట్స్ షెడ్యూల్ మైసూరులో ఉండబోతోంది. ఈ నెల చివరిలో ఈ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.