‘టాక్సీవాలా’టీమ్ కు మెగాస్టార్ అభినందనలు ! (ఫొటోలు)

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించారు. ‘టాక్సీవాలా’ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తోనే లాభాల బాట పట్టి.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఈ చిత్రం మరో హిట్ చిత్రంగా నిలిచింది. పైరసీ అడ్డంకులను దాటుకొని థియేటర్లలోకి వచ్చిన ఈ టాక్సీవాలా అన్ని సెంటర్స్ లో మంచి రెవిన్యూని రాబడుతూ.. బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.

ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి టాక్సీవాలా చిత్ర యూనిట్ ని కలిసి అభినందించారు. టాక్సీవాలా నిర్మాత, దర్శకుడు మరియు హీరోయిన్ ప్రియాంకతో ఇంటరాక్ట్ అయిన మెగాస్టార్, వారి వర్క్ ని మెచ్చుకుంటూ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ మాట్లాడుతూ…ఒక కొత్త క‌థ‌, ఒక కొత్త డైరెక్ట‌ర్, ఒక కొత్త ప్రొడ్యూస‌ర్ రెండు పెద్ద బ్యాన‌ర్లు కాని మొత్తం కొత్త కాస్ట్ అండ్ క్రూ ఒక సంవ‌త్స‌రం పాటు సినిమా తీశాము.జులైలో ఫ‌స్ట్ ట్రైల‌ర్ రిలీజ్ అయి ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందో తెలియ‌ని సినిమా, గీతాఆర్ట్స్ ముందుకు వ‌చ్చి న‌డిపించిన సినిమా, ఆగ‌స్ట్‌లో రా ఫుటేజ్ లీక్ అయిన సినిమా. రిలీజ్‌కి మూడు నెల‌ల ముందు పూర్తిగా లీక్ అయిన సినిమా. ఈ సినిమా గురించి ఎన్ని నెగిటివ్ మాట‌లు వినాలో అన్నీ విన్నాను. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 18న ఈ చిత్రం విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అయింది.

ఈ సినిమాకి ఎంజాయ్ చేసినంత ఏ సినిమాకి ఎంజాయ్ చెయ్య‌లేదు. అస‌లు పూర్తిన స‌చ్చిన సినిమాతోని డాన్స్ ఆడించాము థియేట‌ర్ల‌లో. ఎస్‌కెఎన్ ఈ సినిమా గురించి ఎంత విన్నా కూడా అలాగే స్ర్టాంగ్‌గా నిల‌బ‌డ్డాడు. రెండు పెద్ద బ్యానర్లు కూడా బాగా స‌పోర్ట్ చేశాయి. రాహుల్ కూడా చాలా టెన్ష‌న్ ప‌డ్డాడు. ముందుగా మా టీమ్ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

బ‌న్నీఅన్న‌, ప్ర‌భాస్ అన్న‌,చ‌ర‌ణ్ అన్న‌, వ‌రుణ్ అన్న‌, ర‌ష్మిక‌మంద‌న్న‌, రాశిఖ‌న్నా, దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇలా ఎంతో మంది ట్వీట్ చేసి మా చిత్రాన్ని స‌పోర్ట్ చేశారు. మీరంద‌రూ ఇచ్చిన ఆద‌ర‌ణ వ‌ల్లే సినిమా, సినిమాలోని టెక్నీషియ‌న్లు ఇంత దూరం రాగ‌లిగారు. మీరంద‌రూ థీయేట‌ర్లు నింప‌డం వ‌ల్లే అని అన్నారు. మా అమ్మ‌గారి త‌రుపున కూడా మీ అంద‌రికి ఈ సినిమాని ఇంత స‌క్సెస్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.