నిన్న మహేష్, ఈ రోజు నాని…రేపు ఎవరో?

                                                        (సూర్యం)

చిన్న సినిమాకు పెద్ద సపోర్ట్ దొరికినప్పుడు ఆ కథే వేరుగా ఉంటుంది. అదే  ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమాకు జరుగుతోంది.  ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సీన్ లోకి రావటం, రానా ..ఈ సినిమాని ఓన్ చేసుకోవటంతోనే ఈ సినిమా ఫేట్ మారిపోయింది. లేకపోతే ఓ చిన్న సినిమా గురించి మహేష్ బాబు పనిగట్టుకుని మరీ ట్వీట్ చేయటం ఏమిటి…తెలుగు సెలబ్రెటీలు అంతా సినిమాని చూసి మెచ్చుకోవటం ఏమిటి..వరస పెట్టి జరిగిపోతున్నాయి.

ఇదిగో ఇప్పుడు ఆ వరసలో చిన్న సినిమాలకు పెద్ద హీరో అయిన నాని చేరిపోయారు. ఆయన ఈ సినిమా గురించి ఓ ట్వీట్ చేసారు.  ‘చక్కటి చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’ థియేటర్లలో ఆడుతోంది. దయచేసి ఈ సినిమాను మిస్‌ కాకండి. ఈ చిత్రం గురించి చాలా చెప్పాలి. కానీ ట్వీట్‌, పోస్ట్‌ ద్వారా నా మనసులోని మాటల్ని పూర్తిగా చెప్పలేను’ అంటూ ఆయన వీడియో లింక్‌ను పోస్ట్‌ చేశారు. అందులో ఆయన సినిమా గురించి తన అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా చెప్పేసారు. 

ఇలా తెలుగు సినీ సెలబ్రెటీలు అంతా ఈ చిన్న సినిమాని ఓ రేంజిలో చెప్తూంటే సాధారణ ప్రేక్షకుడుకి ఈ సినిమా చూడాలనే ఆసక్తి పెరిగిపోతోంది. నిజానికి ఆ సినిమాలో స్టఫ్ ఉండటం కూడా వీళ్లంతా ఇంతలా మాట్లాడటానికి ఓ కారణం. మరి రేపటి రోజున ఎవరు ఈ సినిమా గురించి చెప్తారో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి చెప్తారా..ప్రభాస్ ఈ సినిమా ని మెచ్చుకుంటారా లేక పవన్ కళ్యాణ్ ..ఈ సినిమా ట్వీట్ చేస్తారా…మరో స్టార్ హీరో ఈ సినిమా థియోటర్ కు వస్తారా…ఏమో ఏదైనా జరగచ్చు. అప్పటిదాకా స్టే ట్యూన్డ్.