హీరో ఫింగ‌రింగ్‌.. ఆ ద‌ర్శ‌కుడు త‌ట్టుకుంటాడా?

                                 టాక్సీవాలా ద‌ర్శ‌కుడు నానీతో వేగేదెలా?

నేచుర‌ల్ స్టార్ నానీపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అత‌డు స్క్రిప్టు స‌హా షూటింగ్ విష‌యంలో టూమ‌చ్ గా ఇన్వాల్వ్ అవుతాడ‌ని.. అది కొంద‌రికి ఇన్వాల్వ్ మెంట్ అనిపిస్తే చాలా మందికి ఫింగ‌రింగ్ లా అనిపిస్తుంద‌ని గుస‌గుస‌లు ఫిలింన‌గ‌ర్ లో వినిపించాయి ఇదివ‌ర‌కూ.

ఇప్పుడు ఆ డైరెక్ట‌ర్ ప‌రిస్థితి ఏమిటి? అంటూ మ‌రో గుస‌గుస‌. ప్ర‌స్తుతం శ్యామ్ సింగ‌రాయ్ కోసం నానీతో క‌లిసి ప‌ని చేస్తున్న రాహుల్ సంకృత్య‌న్ పైనే ఈ డౌట్. ఆ ఇద్ద‌రికీ పొసుగుతుందా?  సింక్ కుదురుతుందా? అంటూ ఒక‌టే చ‌ర్చ సాగుతోంది.

టాక్సీవాలా ని అలా హిట్ గా తీర్చి దిద్దడం లో డైరెక్టర్ రాహుల్ కి ఎంత క్రెడిట్ ఇవ్వాలో.. ప్రొడక్షన్ టీం కి అంతే క్రెడిట్ ఇవ్వాలి. ఐతే ఇప్పుడు సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో రాహుల్ కలిసి పని చేస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ టైటిల్ ని ఖాయం చేసిన సంగ‌తి విధిత‌మే. ఐతే..! యువ‌ద‌ర్శ‌కుడు రాహుల్ నాని తో ఎలా వర్క్ చేస్తాడు? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్..! నానీకి ఉన్న ఫింగరింగ్ కి మనోడు ఎలా సెట్ అవుతాడో చూడాలి అన్న గుస‌గుస వినిపిస్తోంది. కొన్నిటికి కాల‌మే సమాధానం చెబుతుందేమో!