బిగ్‌బాస్ సీజ‌న్ 4 : ఫైన‌ల్ లిస్ట్ అవుట్..?

తెలుగు బుల్లితెర బిగ్ బాస్ స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు రియాలిటీ షోలంటే హాలీవుడ్, బాలీవుడ్ వైపు చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు తెలుగులో కూడా రియాలిటీ షోలు రావ‌డం, ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డం అన్నీ జరిగిపోయాయి. ఇక స్టార్ మా నిర్వ‌హించే బిగ్ బాస్ రియాలిటీ షో, ఇప్ప‌టికే వ‌రుస‌గా మూడు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని, నాలుగో సీజ‌న్‌లోకి అడుగుపెట్ట‌బోతుంది. క‌రోనా కార‌ణంగా ఈసారి బిగ్‌బాస్ పై కాస్త సందేహాలు మొద‌లైనా, నాలుగో సీజన్ ఖాయ‌మ‌ని తేలిపోయింది.

అయితే ఈసారి 60 నుంచి 70 రోజులు మాత్రమే బిగ్‌బాస్ సీజన్ 4 రన్ అయ్యేలా ప్లాన్ చేసారని స‌మాచారం. గ‌త సీజ‌న్ల‌లో, హౌస్‌లో కంటెస్టెంట్లు దాదాపు 100 రోజులు వ‌ర‌కు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేవారు. అయితే ఈసారి క‌రోనా ప‌రిస్థితులు దృష్ట్యా బిగ్‌బాస్ యాజ‌మాన్యం, రోజుల్ని కుదించింద‌ని తెలుస్తోంది. అంతే కాకుండా 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న త‌ర్వాత, కరోనా పాజిటివ్ లేనివారు మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారట. ఈ క్ర‌మంలో ఎపిసోడ్‌లు త‌క్కువైనా, మ‌సాలా కాన్సెప్ట్‌తో, అలాగే మ‌జా క‌లిగించే గేమ్‌లు ప్లాన్ చేశార‌ని, దీంతో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్‌లో ఎంట‌ర్‌టైనింగ్ త‌గ్గే అవ‌కాశం లేద‌ని స‌మాచారం.

ఇక ఇప్ప‌టికే స్టార్ మా.. బిగ్ బాస్ సీజ‌న్ 4 లోగోను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్ల ఫైన‌ల్ లిస్ట్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం అవుతోంది. ఈ క్ర‌మంలో ఈసారి బిగ్ బాస్‌లో పాల్గొనే 15 మంది పేర్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో హాట్ హీరోయిన్లు, సింగ‌ర్లు, న‌టులు కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఫైన‌ల్ లిస్ట్ ఇదేనా, లేక మార్పులు ఉంటాయా అనేని ప‌క్క‌న పెడితే, ఆ లిస్ట్‌లో ఉన్నా పేర్లు పై ఓ లుక్ వేద్దాం…

## సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న బిగ్‌బాస్ సీజ‌న్ 4 లిస్ట్ ఇదే..!

* శ్రద్దాదాస్
* పూనమ్ భజ్వా
* హంసా నందిని
* యామినీ భాస్కర్
* ప్రియ వడ్లమాని
* హీరో నందు
* అపూర్వ
* సింగర్ సునీత
* సింగర్ మంగ్లీ
* సింగర్ నోయల్
* పొట్టి నరేష్
* వైవా హర్ష
* మహాతల్లి
* అఖిల్ సార్దక్
* మెహబూబా దిల్ సే