బిగ్ అప్డేట్ : బుల్లితెరపై రాకీ భాయ్ “కేజీఎఫ్ 2” రాకకి తేదీ ఖరారు..!

ఈ ఏడాది మన ఇండియన్ సినిమా దగ్గర భారీ హిట్ అయినటువంటి సినిమా మన టాలీవుడ్ నుంచి వచ్చిన ట్రిపుల్ ఆర్(RRR). మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ యూ హీరోలుగా నటించిన ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమా వసూళ్లు చూసి ఈ ఏడాది ఇక ఈ సినిమానే భారీ వసూళ్ల సినిమాగా నిలుస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ దీని తర్వాత అంతకు మించి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2”. శాండిల్ వుడ్ కి చెందిన నటీ నటులు దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన ఈ సినిమా RRR అంత కాకపోయినా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.

కానీ అనూహ్యంగా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో 100 కోట్ల మార్జిన్ తో RRR ని క్రాస్ చేసి ఈ ఏడాదికి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాల్లో RRR ఆల్రెడీ బుల్లితెరపై మన తెలుగు సహా మరో రెండు భాషల్లో ఈ ఆగస్ట్ 14న టెలికాస్ట్ కి వస్తుండగా నెక్స్ట్ ఈ భారీ సినిమా కేజీఎఫ్ 2 కూడా సిద్ధం అయ్యింది.

అయితే ఈ సినిమా జీ తెలుగు ఛానెల్లో ప్రసారం కానుండగా ఈ చిత్రాన్ని ఈ నెక్స్ట్ వీక్ ఆగస్ట్ 21 ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకి టెలికాస్ట్ చేస్తున్నట్టు బిగ్ అప్డేట్ ఇచ్చారు. మరి ఈ రెండు సెన్సేషనల్ సినిమాలు తెలుగు బుల్లితెర దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాయో చూడాలి.