బెల్లం బాబు సినిమా లో  రేణు దేశాయ్ రీ ఎంట్రీ !

ఇంద‌లో రేణు ఓ ముఖ్య పాత్ర‌కు సైన్ చేసిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. ఈ సినిమాకు స్టార్ రైట‌ర్ సాయి మాధ‌వ్ బుర్రా డైలాగులు అందిస్తున్నారు. క‌థ‌లో రేణు పాత్ర కూడా కీల‌కంగా ఉంటుంద‌ని , అందువ‌ల్లే చిన్న సినిమా అయినా ఒప్పుకుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం బెల్లంకొండ రాక్ష‌సుడు సినిమా చేస్తున్నాడు.

ప‌వ‌న్ మాజీ భార్య‌గా తెలుగులో ఆమెకు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ప‌వ‌న్ తో విడిపోయినా ఇంకా వదిన‌మ్మ‌గా భావించే అభిమానులెంద‌రో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె ఎంట్రీ ఓ పెద్ద మూవీతోనే ఉంటుంద‌ని భావించారు. కానీ అన్ ఎక్స్ పెక్టెడ్ గా చిన్న సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌డం అనేది కాస్త నిరుత్సాహానికి గురిచేసే వార్తే.