బందోబ‌స్త్‌ రిలీజ్ తేదీ ఖరారు

హీరో సూర్య‌, మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్‌, ప్ర‌ముఖ హీరో ఆర్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కేవీ ఆనంద్ తెర‌కెక్కిస్తున్న చిత్రం క‌ప్పాన్. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘కప్పాన్‌’ మూవీ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్ర పోషిస్తుండ‌గా, సూర్య ఆయ‌న‌కి ర‌క్ష‌కుడిగా ఉంటాడ‌ట‌. స్టూడియో గ్రీన్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సాయేషా సైగ‌ల్.. సూర్య స‌ర‌స‌న న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 30న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని సాహో చిత్రం కూడా అదే రోజు విడుద‌ల కానుండ‌డంతో చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 20న విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించి త్అధికారిక ప్ర‌క‌టన రానుంది. దేశ‌భక్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో బందోబ‌స్త్ అనే టైటిల్‌తో విడుద‌ల చేయ‌నున్న