త్వరలో చిరంజీవితో బాలయ్య భేటీ.! 

తెలుగు పరిశ్రమలో కనిపించని రెండు శిబిరాలు వున్నాయి. ఒకటి మెగా కాంపౌండ్. ఇందులో డజన్ మంది హీరోలు వున్నారు. వారందరికీ బాస్ మెగాస్టార్ చిరంజీవి. 

ఇక రెండవది నందమూరి  శిభిరం. వీళ్ళకి  మెగా శిబిరం అంత యూనిటీ లేకపోయినా ఈ ఫ్యామిలీతోనే సినిమాలు చేసే దర్శకులు నిర్మాతలు వున్నారు. ఈ గ్రూప్ అందరికి బాస్ నందమూరి బాలకృష్ణ. 

చిరంజీవి బాలకృష్ణ మధ్య ఏమంత మంచి సంబంధాలు లేవని అందరికి తెలిసిందే. బాలకృష్ణ అనేకసార్లు పరోక్షంగా చిరంజీవి గురుంచి ఘాటు వ్యాఖ్యలు చేయడం అందరూ విన్నారు చూసారు.  వీరి మధ్య రిలేషన్ ఇలా ఉంటే ఇక వీరి అభిమానులు గురుంచి చెప్పనవసరం లేదు  . పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. 

ఇటువంటి నేపధ్యం వున్న చిరంజీవి మరియు బాలకృష్ణలు కలుస్తున్నారు. దీనికి ఓ కారణం వుంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీర్రయ్య బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి 2023 సంక్రాంతి కి విడుదలవుతున్నాయి. ఈ బాక్సాఫీస్ పోరు తప్పించడానికి, వారి వారి నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్ల శ్రేయస్సు కోసం  వీళ్లిద్దరు కలుస్తునట్టు తెలుస్తుంది

మాములుగా అయితే వీళ్లిద్దరు కలిసే రకాలు కాదు. ఎవరి ఈగోలు వాళ్లకు వున్నాయి. అయితే ఒక ప్రముఖ దర్శకుడు చొరవ తీసుకొని ఆ కలయికకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని తెలిసింది.