ఆపండి, మేము చిరుతో సినిమా చేయటం లేదు

గత కొద్ది రోజులుగా చిరంజీవి, వైజయంతి మూవీస్ కాంబినేషన్ లో మహానటి దర్శకుడు డైరక్షన్ లో సినిమా ప్రారంభం కానున్నదంటూ వెబ్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు వెల్లువ మొదలైంది. మహానటి రిలీజైనప్పుడు ఆ చిత్రం ప్రమేషన్ లో భాగంగా చిరు..త్వరలో ఆ దర్శకుడుతో సినిమా చేయబోతున్నట్లు చెప్పారు.

అది పాతాళభైరవిలాంటి సినిమా అంటూ హింట్ ఇచ్చారు. దాంతో చాలా మంది ఆ సినిమా వచ్చే నెలలో మొదలు కాబోతోందంటూ ప్రచారం చేస్తున్నారు.

ఈ విషయం వైజయంతి మూవీస్ దాకా వెళ్లింది. మీడియా వారు సైతం ఫోన్ లు చేసి అడగటం మొదలెట్టారు. వారు ఈ ప్రచారాన్ని ఆపాలనుకున్నారు. దాంతో తమ సోషల్ మీడియా పేజీలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

‘వైజయంతి మూవీస్‌ తర్వాతి సినిమా చిరంజీవితో ఉంటుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ సంస్థ, చిరంజీవి కాంబినేషన్‌లో నాలుగు బ్లాక్‌బస్టర్స్‌ వచ్చాయి. ఐదో సినిమా తీసేలా ఉంటే గర్వంగా మేమే ప్రకటిస్తాం’ అని ఆ ట్వీట్ సారాంశం.

ఇక  ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’, ‘జై చిరంజీవ’ సినిమాలను చిరు హీరో గా వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మించింది.