రజనీకాంత్ “పేట “పై వేటు పడిందా ?

ఆంధ్ర ,తెలంగాలో తెఆరేలా మోనోపలి అంశం మరోసారి తెర మీదకు వచ్చింది . ఇప్పటివరకు ఈ మోనోపలి గురించి చిన్న నిర్మాతలు వాపోవడం విన్నాము . ఇప్పుడు దేశంలోనే టాప్ స్టార్ , టీవీ రంగంలోనే పేరున్న సన్ టీవీ కి చెందిన కళానిధి మారన్ రజనీకాంత్ హీరోగా నిర్మించిన పేట సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడం లేదట .

రజనీకాంత్ , సిమ్రాన్ ,త్రిష ,విజయ్ సేతుపతి తో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన “పేట ” సినిమా కు థియేటర్లు లభించడం లేదన్న వార్త తెలుగు సినిమా రంగంలో కలవరం పుట్టిస్తుంది . పేట ” సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న వల్లభనేని అశోక్ స్వయంగా ఈ విషయం చెప్పాడు .

తమ సినిమాకు థియేటర్లు లేకుండా దిల్ రాజు, అల్లు అరవింద్ , సురేష్ బాబు లాంటివారు అడ్డుపడుతున్నారని చెప్పాడు .
సురేష్ బాబు కుమారుడు రానా నటించిన “ఎన్టీఆర్ బయోపిక్ ” తమ్ముడు వెంకటేష్ నటించిన “ఎఫ్ 2” చిత్రాలు విడుదలవుతున్నాయి . కాబట్టి ఎక్కువ థియేటర్లు వీటికి కేటాయించాలనే సురేష్ బాబు ప్రయత్నిస్తుంటాడు . ఇక అల్లు అరవిందు విషయానికి వస్తే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ ” నాగబాబు కుమారుడు నటించిన “ఎఫ్ 2” సినిమాలు సంక్రాంతికే విడుదలవుతున్నాయి . వీరి సినిమాలకు ఎక్కువ థియేటర్లు వుండాలని అరవింద్ అనుకుంటాడు .

అల్లు అరవింద్ , సురేష్ బాబుకు అత్యంత సన్నిహితుడు దిల్ రాజు . కాబట్టి వీరందరూ “ఎన్టీఆర్ బయోపిక్” , “వినయ విధేయ రామ “, “ఇఫ్ 2” సినిమాల తరువాతనే ఏ సినిమా అయినా అది రజనీ కావచ్చు మరెవరైనా కావచ్చు . తెలుగుసినిమాలో వీరి మోనోపలి ని ప్రశ్నించేవారే లేకుండా పోయారు . నిర్మాతను మండలి , చలన చిత్ర వాణిజ్య మండలి , మూవీ ఆర్టిస్టు అసోసియేన్ అన్నీ వీరి కనుసన్నల్లోనే ఉంటాయి . ఇక ప్రభుత్వాలు చెప్పుకున్నా , అక్కడా వీరి మొర ఆలకించరు . రజనీకాంత్ చిత్రం పోటీగా వచ్చిందని కోపంతో ఇలా చేశారా ? ఇది ఆరోగ్యకరమైన వ్యాపారమేనా ?
రాజనీకాత్ పరిస్థితి ఇలావుంటే …. మిగతా వారి గురించి కనీసం ఊహించలేము కూడా !