మలైకా అరోరాఖాన్ నుంచి విడిపోయాక సల్మాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ ఆండ్రియాతో సహజీవనం చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఇక ఇదే సమయంలో మలైకా సైతం యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ఎఫైర్ సాగించడంపై బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇకపోతే మలైకాతో అర్జున్ సీక్రెట్ ఎఫైర్ ఈ జంట విడిపోవడానికి కారణమైందన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. అయితే ఇది నిజమా?
ఇదే విషయాన్ని ఓ మీడియా జర్నలిస్ట్ సూటిగానే ఆర్భాజ్ ని ప్రశ్నించాడు. మలైకాతో మీ విడాకుల వెనక అర్జున్ కపూర్ కారణమా? అని సూటిగా ప్రశ్నించాడు ఆ జర్నలిస్ట్. అందుకు ఆర్భాజ్ తీవ్రంగానే హర్ట్ అయ్యాడని అతడి సమాధానం చెబుతోంది. పాజీ.. అంటూ పంజాబీలో కాస్త వ్యంగ్యంగా ఆన్సర్ మొదలు పెట్టిన ఆర్భాజ్.. ఇంటెలిజెంట్ క్వశ్చన్ నే అడిగావ్. ఈ ప్రశ్న అడిగేందుకు నిన్న రాత్రి అంతా ఆలోచించి ఉంటావు. మరి నేను కూడా టైమ్ తీసుకుని ఆలోచించి సమాధానం చెప్పమంటావా? అంటూ వ్యంగ్యంగానే స్పందించాడు ఆర్భాజ్. ఒక రకంగా ఆన్సర్ తెలిసీ ఇలా ఎందుకు అడుగుతావ్? అన్న అసహనాన్ని వ్యక్తపరిచాడు అతడు. ఇక మలైకాతో అర్జున్ కపూర్ ఎఫైర్ వ్యవహారంపై ఇప్పటికే ఆర్భాజ్ తో పాటు సల్మాన్ ఖాన్ ఎంతో సీరియస్ గా ఉన్నాడు. అర్జున్ కపూర్ – బోనీకపూర్ ఫ్యామిలీతో సత్సంబంధాలు తెగిపోయాయి. వద్దు మొర్రో అంటున్నా మలైకాతో స్నేహం చేశాడని అర్జున్ కపూర్ వ్యవహార శైలిపై నెత్తి నోరు కొట్టుకున్నాడు బోనీ. సల్మాన్ తో తన స్నేహం చెడిందని పబ్లిగ్గానే వాపోయాడు. కానీ అర్జున్ తీరు మాత్రం మార్చుకోలేదు. ఇక అర్జున్ తో తన జీవనం ఎంతో సంతోషంగా ఉందని తమ పెళ్లి గురించి అసలేమీ అడగొద్దని మలైకా ఓ మీడియా వేదికగా చిట్ చాట్ లో కోరింది.
