వైరల్ : టాలీవుడ్ కి విజయసాయి రెడ్డి నుంచి లేటెస్ట్ డిమాండ్.!

Vijayasai Reddy'

గత కొన్నాళ్ల కితం టాలీవుడ్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అలాగే వైఖరి కూడా ఏ స్థాయిలో ఉందో ఎంతవరకు వెళ్లిందో కూడా అందరికీ తెలిసిందే. సినిమా టికెట్ ధరల విషయంలో కానీ ఏపీలో షూటింగ్ జరగడం అనే అంశంపై కానీ ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ కి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అయితే తీసుకొచ్చింది.

దీనితో అక్కడ నుంచి టాలీవుడ్ తప్పకుండ ఏపీ లో కూడా షూటింగ్స్ ఇతర అంశాల్లో పరిగణలో తీసుకోవాలని లేని పక్షంలో సినిమాలకి ఇబ్బందులు తప్పవు అన్నట్టు తెలిపారు. ఇక లేటెస్ట్ గా అయితే టాలీవుడ్ విషయంలో ఏపీ రాజ్య సభ అధ్యక్షుడు ఎంపీ విజయసాయి రెడ్డి తన స్పందన తెలియజేసారు.

ఏపీలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విషయంలో ఆనందం వ్యక్తం చేశారు. గాడ్ ఫాదర్, నాగ్ ఘోస్ట్ సినిమాలపై పాజిటివ్ ముగా స్పందిస్తూ మిగతా టాలీవుడ్ కి డిమాండ్ వ్యక్తం చేశారు. “యువ సామ్రాట్ నాగార్జున చిత్రం “ది ఘోస్ట్” ప్రీరిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించడం సంతోషం.

ఆ  సినిమా యూనిట్ కు నా  శుభాభినందనలు. టాలీవుడ్ చిత్రాలకు 60% మార్కెట్ ఏపీ కాబట్టి…హీరోలు, నిర్మాతలు చొరవ తీసుకొని సినిమా ఈవెంట్లు, షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏపీలో నిర్వహించాలి.” అని అయితే డిమాండ్ చేయడం జరిగింది. దీనితో ఈ ట్వీట్ ఇపుడు టాలీవుడ్ సహా సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.