కొణిదెల కాంపౌండ్ నుంచి బ‌రిలో మ‌రో వార‌సుడు!

Megastar Chiranjeevi

మెగా కాంపౌండ్ నుంచి ఇప్ప‌టికే డ‌జ‌ను మంది హీరోలు ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. మెగా వృక్షం నీడ‌లో ఇంత‌మంది స్టార్లుగా ఎదిగారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే కాంపౌండ్ నుంచి మ‌రో వార‌సుడు బ‌రిలో దిగుతుండ‌డం ఆస‌క్తిగా మారింది.

ఇంత‌కీ ఎవ‌రీ వార‌సుడు? అంటే.. పవన్ తేజ్ కొణిదెల అనేది ఆయ‌న పేరు. రామ్ చరణ్ కి తమ్ముడు వరస. హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమ‌వుతున్నాడు. నూతన దర్శకుడు అభిరామ్ దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెలను హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత రాజేష్ నాయుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. ఈ సినిమాకి `ఈ కథలో పాత్రలు కల్పితం` అనే ఇంట్రస్టింగ్ టైటిల్  ని నిర్ణ‌యించారు. కొణిదెల బ్రాండ్ తో వ‌స్తున్న ఈ కుర్రాడు ఎంత‌వ‌ర‌కూ స‌క్సెస‌వుతాడు అన్న‌ది చూడాలి. పవన్ తేజ్ ఇంతకుముందు ఖైదీ నెం.150- రంగస్థలం- వాల్మీకి వంటి చిత్రాల్లో న‌టించారు.