ఏక్ట్ ఫైబర్ నెట్ పై కోర్టుకు ఎక్కిన నాగార్జున

బెంగుళూరు బేస్డ్ ప్రైవేట్ ఇంటర్ నెట్ ప్రొవైడర్ ఆక్ట్ ఫైబర్ నెట్ ఫై కింగ్ నాగార్జున కేసు వేశారు. నాగార్జునకు ఆక్ట్ ఫైబర్ కు రిలేషన్ ఏంటి ? అని అనుకుంటున్నారా ? హైదరాబాద్, బెంగుళూరులో టాప్ ఇంటర్నెట్ సంస్థ గా ఎదిగిన ఆక్ట్ ఫైబర్ తాజాగా తన లోగో ని రిలీజ్ చేసింది.

ఆ లోగో అచ్చం అన్నపూర్ణ స్టూడియోస్ లోగో లాగా ఉండటంతో షాకైన నాగార్జున ఆ లోగో పై ఆక్ట్ ఫైబర్ పై కేసు వేసాడు . ఆక్ట్ ఫైబర్ కు ఇంతకుముందు లోగో మరోలా ఉండేది కానీ తాజా లోగో మాత్రం అన్నపూర్ణ బ్రాండ్ ని యాజటీజ్ దింపేసారు.

దాంతో తమ సంస్ద లోగోను కాపీ చేశారని ఆ కంపెనీ ఫై కోర్ట్ లో కేసు వేశారు నాగార్జునకు చెందిన లీగల్ టీమ్. ప్రస్తుతానికి ఈ కేసు పెండింగ్ లో వుంది. తర్వలోనే హియరింగ్ కు రానుంది. కేసు తేలేవరకు ఆక్ట్ ఆ లోగో ను ఉపయోగించకూడదు.

ఇక నాగ్ సినిమాల విషయానికి వస్తే.. ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఆగిపోవడంతో తెలుగులో బిజీ అయిపోయాడు నాగ్. గతేడాది ‘చిల‌సౌ’ ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో ‘మ‌న్మ‌థుడు 2’ చేస్తున్నాడు నాగార్జున‌.

త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. తొలి షెడ్యూల్ పోర్చుగల్లో జరగనుంది. నాగార్జున కూడా ఈ చిత్రం గురించి ఆస‌క్తిగా చూస్తున్నాడు. తన సొంత బ్యానర్ అన్నపూర్ణలోనే మన్మథుడు 2 రానుంది.