భర్త (ఏ.ఎల్.విజయ్) నుంచి విడాకులు తీసుకున్న అనంతరం అమలాపాల్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. మునుపటితో పోలిస్తే పాల్ 2.0 రీలోడెడ్ అన్నంత స్పీడ్ గా చెలరేగిపోతోంది. 2019లో రిలీజైన `ఆడై` సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో నగ్నంగా కనిపించి షాకిచ్చిన అమలాపాల్ వరుసగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకు సంతకాలు చేసింది. అంతేకాదు సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే పోస్టింగులతో అభిమానులకు టచ్ లో ఉంది.
తాజాగా మత యోగా అంటూ రకరకాల ఆసనాలు వేస్తూ హీటెక్కించేస్తోంది. ఇదిగో ఇలా బీచ్ లో శీర్షాసనం వేసి అభిమానులకు సర్ ప్రైజ్ ట్రీటిచ్చింది. బీచ్ లో కెరటాలకు అభిముఖంగా నిలిచి .. హెడ్-స్టాండ్ పోజ్ తో అదరగొట్టింది. యోగా ధ్యానం స్పిరుచ్చువాలిటీ అంటూ తనలోని మార్పు గురించి ఏదోలా లీకులు ఇచ్చేస్తోంది అమలాపాల్. `అమావాస్య కర్మ` పేరుతో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోల్ని షేర్ చేసుకుంది. “న్యూ మూన్ – ఫ్రెష్ స్టార్ట్“ అంటూ రకరకాల కొటేషన్లు ఇచ్చింది.
“విత్తనాలను నాటి ఇనిస్టిట్యూషన్ ని సెట్ చేసే సమయమిది. నేను # న్యూమూన్ సమయంలో ఈ శక్తివంతమైన ఆచారాన్ని అనుసరిస్తున్నాను. నాకోసం నేను కొంత సమయం కేటాయించాను. ఆత్మపరిశీలన చేసుకుని… నా జీవితంలో రీసెట్ .. రీఎలైన్ మెంట్ ని ఇనిషియేట్ చేయాలనుకుంటున్నా. అనుకున్నది వెంటనే చేసేస్తున్నా“ అని తెలిపింది. నా శరీరంపైనే దృష్టి సారించాను. PERFECTION ను వీడటానికి.. నా FLAWED-SELF ని తో లీనమయ్యాను. FLOW OF LIFE కి లొంగిపోయాను.. అంటూ పోయెటిక్ గా స్పందించింది. ఇది సెల్ఫ్-లవ్ .. సెల్ఫ్-రెస్పెక్ట్ వ్యవహారమని అర్థం చేసుకోండి. అలాగే యోగ సాధనతో శక్తి పెరుగుతుందని పాల్ తెలిపింది.
మరోవైపు అమలాపాల్ పై రకరకాల రూమర్లు ఆగడం లేదు. తన రెండో పెళ్లిపైనా ఇటీవల ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. స్నేహితుడు భవీందర్ సింగ్ ని పెళ్లాడబోతోందని ప్రచారమైంది. దీనిపై అమలా ధీటైన సమాధానమే ఇచ్చింది. “నా పెళ్లికి ఇంకా కొంత సమయం ఉంది. నేను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. అవి పూర్తయ్యాక.. నా పెళ్లి గురించి ప్రకటిస్తాను. నా ప్రేమ గురించి మాట్లాడాను. కాబట్టి నేను నా పెళ్లి గురించి కూడా మాట్లాడుతాను. కాబట్టి అప్పటి వరకు నా పెళ్లిపై పుకార్లు వ్యాప్తి చేయవద్దు. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాను“ అని తెలిపింది. కెరీర్ పరంగా చూస్తే.. హిందీ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ సౌత్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తూ అమలాపాల్ బిజీగా ఉంది. మహేష్ భట్ క్యాంప్ లోని క్లాసిక్ తార `పర్వీన్ బాబీ` బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
