అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరూ అంటే అమలాపాల్ అని చెప్పాలి. `మైనా` సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమల తెలుగులో రామ్‌చరణ్, అల్లు అర్జున్ సరసన నటించింది. ఆ తర్వాత కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారానూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
అయితే సక్సెస్ తో పాటు కెరీర్ ప్రారంభంలోనే ప్రేమ, పెళ్ళి, ఆ తరువాత కొద్దికాలానికే భర్తతో విడాకులు…అంటూ వరసగా జరిగిపోయాయి. ఇవన్నీ అమలాపాల్‌ను మానసికంగా కొద్దిగా ఇబ్బంది పెట్టినా, దాని ప్రభావం నుంచి త్వరగా కోలుకుని తిరిగి హీరోయిన్‌గా బిజీ అవుతూ వస్తోంది. అంతేకాదు తన నటనను దక్షిణాదికే పరిమితం చేయకుండా అమలాపాల్ నార్త్ వైపు కూడా దృష్టిని సారించింది. తాజాగా ఈ డస్కీ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ బీచ్ ఫొటోలు పోస్ట్ చేసింది.
అంతే కాదు తనకు ఎప్పుడు దిగులుగా అనిపించినా బీచ్‌కు చేరుకుంటానని అంటోంది. బీచ్ ఫొటోలను పోస్ట్ చేస్తూ “ప్రశ్న ఎలాంటిదైనా సరే దానికి బీచ్‌లో సమాధానం దొరుకుతుంది. బీచ్ పాఠశాలలాంటిది. అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తుంది. నాకు మరిన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు జీవితంలో మూడేళ్ల ముందు నీ పరిస్థితి ఏంటి? అని ఆలోచిస్తాను అని చెప్పింది.
మూడేళ్ల క్రితం దర్శకుడు విజయ్‌తో అమలాపాల్ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచే ఆమె ట్రావెలింగ్ , ట్రెక్కింగ్, బీచ్ లో స్కైడైవ్స్ మీద ఇష్టాన్ని పెంచుకున్నానంటోంది. ఇప్పుడు అమల ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది.