నటుడు నాగార్జున సతీమణి అక్కినేని అమల బ్లూ క్రాస్ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. మూగజీవాల కు, వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టినా అమల క్షణాల్లో స్పాట్ వాలిపోతారు. అందుకు గల కారకులపై నిప్పులు చెరుగుతారు. చట్టపరంగా ముందుకెళ్లడానికి ఎంత మాత్రం ఆలోచించరు. అమల కొన్ని దశాబ్ధాలుగా ఇలాంటి సేవలు అందిస్తున్నారు. సోషల్ యాక్టివిస్ట్ గా ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా మూగ జీవాల విషయంలో అమల సేవలు ఎంతో గొప్పవి. మరి మూగ జీవాలకు..వన్యప్రాణి జీవాలకు కుటుంబ సభ్యులే హాని తలపించేలా ప్రవర్తిస్తే ఎం చేస్తారు? ఫ‌్యామిలీ మెంబర్లపై ఎలా స్పందిస్తారు? అంటే అమలకు ఆ విషయంలో తన మన అనే బేధాలంటూ ఏమీ ఉండవని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read More : డార్లింగ్ ప్రభాస్ పారితోషికం 100 కోట్లు…?!
అవును అమలకు ఆవిషయంలో కట్టుకున్న భర్త అయినా…పరాయి మనుషులైన ఒక్కటేనని చెప్పడానికి కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనే చక్కని ఉదాహరణ. అమల-నాగార్జు 1992 లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెట్టి తర్వాత నాగార్జు 1995లో అలీ హీరోగా ఎస్ వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన `ఘటోత్కచుడు` లో ఓ పాటలో నటించారు. అందులో నాగార్జున ఓ సన్నివేశంలో పులి రూపంలో కనిపిస్తారు. సరిగ్గా ఆ పాట చిత్రీకరణ సమయంలోనే అమల మన్మధుడికి సైతం సౌండ్ లేకుండా చేసారు. అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోలో ఆ పాట చిత్రీకరించేటప్పుడు అమల సెట్ లో కాలు పెట్టారు. అప్పటికే ఓ పులి(నిజమైన) అక్కడ ఉంది. దానికి నోరు కుట్టేసి ఉంది.
Read More : జగన్ గుండెల మీద కుంపటి పెట్టిన ఎమ్మెల్యే !
ఇంకా ఇతర శరీరమంతటా గొలుసులతో చుట్టేసి ఉంది. ఆ సన్నివేశం చూసిన అమల ఆగ్రహంతో ఊగిపోయారు. నోరు లేని జీవాన్ని సినిమా కోసం అలా హింసిస్తారా? అని చిత్ర యనిట్ పై మండిపడింది. ఆ సమయంలో నాగార్జునను సైతం విడిచిపెట్ట లేదు. యూనిట్ తో కలిపి నాగార్జునపైనా దండెత్తిందిట. దీంతో నాగార్జునకి సౌండ్ లేదు. అమల ఆవేదనలో అర్ధం ఉందని మౌనంగా ఉండిపోయారు. అలా అమల కారణంగా ఆ సన్నివేశాల్ని మొత్తాన్ని సినిమా నుంచే తీసారు. ఆ తర్వాత దర్శకుడు ఎస్ . వి కృష్ణారెడ్డి ఆ సన్నివేశాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసి సినిమాలో చూపించారు.
Read More : ఇండస్ట్రీకి మరో సహజసిద్ధమైన డైరెక్టర్ వచ్చాడు !
ఆ పాట పెట్టడానికి..అందులో నాగార్జున నటించడానికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. అంతకు ముందు ఎస్.వి కృష్ణారెడ్డి అలీ హీరోగా `యమలీల` తెరకెక్కించారు. అందులో ఓ ప్రత్యేక పాటలో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. దీంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సెంటిమెంట్ తోనే నాగార్జునని పట్టుబట్టి ఒప్పించి ఘటోత్కచుడి కోసం రంగంలోకి దింపారు. కానీ కృష్ణారెడ్డి సీన్ ని అమల రివర్స్ చేసారు. అమల ఉగ్ర రపం చూసిన నాగార్జునకు తొలి వేళ కూడా అదేనట.