ఒక్కోసారి ఒక్కో స్పందనకు అర్థం మారిపోతుంటుంది. అలాంటి ఓ పోస్టింగ్ తో యువహీరో అల్లు శిరీష్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యాడు. `జీవితం తలకిందులైంది` అనే క్యాప్షన్ తో అతడు తాజాగా ఓ ఫోటోని సోషల్ మీడియాల్లో షేర్ చేయడంపై ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారంతా.
ఈ ఫోటోలో అతడు చక్రాసనం వేసాడు. అది తన ఇంటి బాల్కనీ పరిసరాల్లో ఒక యోగా మ్యాట్ పై ఇలా చేశాడు. ఆ ఫోటో ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ అవుతోంది. అన్నట్టు జీవితం ఎందుకని తలకిందులైనట్టు? అంటే.. అతడు గడిచిన ఏడెనిమిదేళ్ల కెరీర్ లో కెరీర్ ని బిల్డ్ చేసుకోవడంలో తడబడ్డాడు. కొండంత అండగా నాన్న గారు అల్లు అరవింద్ .. అన్నయ్య అల్లు అర్జున్ తన వెంట ఉన్నా కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. అందుకేనా ఈ నైరాశ్యం. కొన్ని వరుస వైఫల్యాలు అతడిని కుంగ దీశాయా? అయితే తన వైఫల్యాన్ని కూడా శిరీష్ ఇంత తెలివిగా ఒప్పుకున్నాడన్నమాట!! అంటూ నెటిజనుల్లో డిబేట్ స్టార్టయ్యింది. అయితే మొండివాడైన శిరీష్ హీరోగా ఎలాగైనా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. కరోనా లాక్ డౌన్ తొలగిపోతే తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్ తో ముందుకొస్తాడట.
