Home Tollywood 'సైరా'లో అల్లు అర్జున్? అసలు నిజం ఇదే?

‘సైరా’లో అల్లు అర్జున్? అసలు నిజం ఇదే?

కొన్ని కాంబినేషన్ లు వినటానికి చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. దాంతో ఆ కాంబోలు జరిగినా జరగకపోయినా మీడియావాళ్లు మాత్రం తమదైన శైలిలో వాటి చుట్టూ రూమర్స్ అల్లుతూంటాయి. అలాంటి అరుదైన కాంబోలలో చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి ఒకే సినిమాకు చేయటం ఒకటి. వాస్తవానికి ఎంత చిరంజీవి సినిమా అయినా అల్లు అర్జున్ వంటి స్టార్ కు క్యారక్టర్ ఇవ్వాలంటే చాలా ప్రత్యేకత కలిగిన పాత్రై ఉండాలి.

లేకపోతే ఫ్యాన్స్ కు ఇబ్బందే. అల్లు అర్జున్ కూడా నటిస్తున్నారని చూడటానికి వెళ్లినవారికి నిరాశే. దాంతో సినిమాపై లేనిపోని అంచనాలు పెంచి, అదే చేత్తో సినిమాని కిల్ చేసేసినట్లు అవుతుంది. అందుకే హీరోలు ..గెస్ట్ గా చేయమన్నా ఆచి,తూచి అడుగులు వేస్తూంటారు.

ఇక అసలు విషయంలోకి వస్తే.. గత కొద్ది రోజులుగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోన్న… ఈ సినిమా గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడనేది ఆ వార్త సారాంశం.

Chiranjeevi Sai Raa Reddyt 0 | Telugu Rajyam
‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డిగా బన్నీ అద్భుతమైన పాత్రను పోషించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరహా పాత్రనే ఆయన ఈ సినిమాలోను చేయనున్నాడని అంటున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అందులో నిజం ఏమీ లేదని తెలుస్తోంది. మొదట అల్లు అర్జున్ ని ఓ పాత్ర కోసం అనుకున్నా సినిమాపై అంచనాలు పెరుగుతాయని చిరంజీవి నో చెప్పారని సమాచారం.

అలాగని అల్లు అర్జున్ ని సురేంద్రరెడ్డి వదిలి పెట్టేది లేదు..ఆయన్ని ప్రాజెక్టులోకి తీసుకునిరావాల్సిందే అని సురేంద్రరెడ్డి పట్టుబట్టారట. దాంతో అల్లు అర్జున్ నటించడం లేదు కానీ గొంతును వాడబోతున్నారని సమాచారం. ఈ సినిమా వాయిస్ ఓవర్‌తో ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ వాయిస్ ఓవర్‌ను బన్నీతో చెప్పిస్తారని తెలుస్తోంది.

నటించకపోయినా.. స్టైలిష్ స్టార్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమాకు ప్లస్ అవుతుందని.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. దీనికి బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో నయనతార, అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News