బాల్య స్నేహితుడి కోసం బ‌న్నివాసుకి హ్యాండు! 

                                        ఫ్రెండు బ‌న్ని వాసుకి హ్యాండిచ్చాడా?

అల్లు అర్జున్ కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ పుష్ప (ఏఏ20) ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హ‌మ్మారీ వైర‌స్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. అన్నీ అనుకూలిస్తే గోదావ‌రి ప‌రిస‌రాల్లో చిత్రీక‌ర‌ణ కోసం సెట్స్  రెడీగా ఉన్నాయ‌ని తెలిసింది.

ఆ మూవీ సెట్స్ పై ఉండ‌గానే తాజాగా అల్లు అర్జున్ న‌టించ‌నున్న‌ 21వ సినిమాని ప్ర‌క‌టించారు. ఏఏ 21 చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. తాజాగా ప్రీలుక్ పోస్ట‌ర్ ని టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో ఇద్ద‌రు వ్య‌క్తులు అల్లంత దూరాన సాగ‌ర తీరాన ఉన్న ఊరిని ప‌రిశీల‌న‌గా చూస్తున్నారు. ఆ ఇద్ద‌రి షాడో ఏదో చెబుతోంది. ఆ ఇద్ద‌రూ ఆ సాగ‌రాన్ని దాటేందుకు ఒక తెప్ప‌ను రెడీ చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. మొత్తానికి ఈసారి కూడా కొర‌టాల త‌న‌దైన శైలి సామాజిక క‌థాంశాన్నే ఎంచుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

అన్న‌ట్టు ఈ చిత్రాన్ని బ‌న్ని వాసు గీతా ఆర్ట్స్ 2 (జీఏ2) బ్యాన‌ర్ లో నిర్మిస్తార‌ని చాలాకాలంగా ప్ర‌చార‌మ‌వుతోంది. కానీ ఉన్న‌ట్టుండి కొత్త నిర్మాత ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  కొరటాల శివ ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ యువసుధ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీనికి అల్లు అర్జున్ స్నేహితులు శాండీ – స్వాతి – నట్టి లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ మూవీకి వ‌ర్కింగ్  పార్ట‌న‌ర్ గా అయినా బ‌న్ని వాసు ఉంటాడ‌నుకుంటే అందుకు ఆస్కార‌మే లేకుండా పోయింది. అయితే మిక్కిలినేని బ‌న్నికి బాల్య స్నేహితుడు. బ‌న్ని వాసు కంటే ముందే స్నేహితుడు. అందుకే అత‌డికి ఛాన్సిచ్చేందుకు బ‌న్ని వాసును సైడేశాడా? అన్న‌ది తెలియాల్సి ఉంది.