టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు ఎంత టైం కేటాయిస్తాడో ఫ్యామిలీకి అంతే సమయాన్ని వెచ్చిస్తుంటాడు. అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి ఎంత అల్లరి చేస్తాడో అందరికీ తెలిసిందే. అర్హ, అయాన్‌లతో బన్నీ చేసే సందడి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. అలాంటి బన్నీ తన పిల్లలు, భార్యకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో తాజాగా బయట పడింది. బన్నీ తాజాగా సమంత సామ్ జామ్ షోలో పాల్గొన్నాడు.
ఆ షోలో బన్నీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలెన్నో కూడా చెప్పుకొచ్చాడు. రీసెంట్‌గా అర్హ పుట్టినరోజు కోసం పుష్ప సెట్‌లో సెలెబ్రేషన్స్, మళ్లీ షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి ఇంటికి వెళ్లడంపైన సమంత ప్రశ్నలు కురిపించింది. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా? అని సమంత అడిగింది. మనం ఎంత హ్యాపీగా ఉంటే షూటింగ్‌లో అంత బాగా పర్ఫామెన్స్ చేయగలం, మనం హ్యాపీగా ఉండాలంటే ఫ్యామిలీతో టైం గడపాలి అని బన్నీ చెప్పుకొచ్చాడు.
తాను షూటింగ్‌లు ఎప్పుడు చేసినా కూడా ఓ మూడు రోజులు మాత్రం ముందే బ్లాక్ చేసేయమని చెబుతాను.. అర్హ, అయాన్, స్నేహాల బర్త్ డే రోజున తప్పా మిగతా ఎప్పుడైనా సరే షూటింగ్‌లు పెట్టుకోమని చెబుతాను. ఒకవేళ అవుట్ డోర్ షూటింగ్ అని, క్యాన్సిల్ చేయడం కుదరదని ఎవరైనా చెప్పినా వినను.. కావాలంటే క్యాన్సిల్ చేస్తే వచ్చే నష్టానికి నేను డబ్బులు ఇస్తాను అని చెబుతాను అంటూ బన్నీ పేర్కొన్నాడు. మొత్తానికి బన్నీకి ఫ్యామిలీ అంటే ఎంతిష్టమో అర్థమైంది.