‘నిన్ను కోరి’తమిళ రీమేక్: నాని క్యారక్టర్ వేసేదెవరంటే..

తెలుగులో యంంగ్ డైరక్టర్స్ వరస హిట్స్ ఇవ్వటంతో … మన కథలే మిగతా భాషలకు రీమేక్ లుగా ప్రమోట్ అవుతున్నాయి. ఇటీవల అజయ్ భూపతి తెరకెక్కించిన ‘Rx 100’ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను తమిళ్‌‌లో రీమేక్ చేస్తున్నారు. అంతకు ముందు విడుదలైన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్ చేస్తున్నారు. తాజాగా నాని నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం తమిళ్‌లో రీమేక్ చేయబోతున్నారు.

వివరాల్లోకి వెళితే… నేచుర‌ల్ స్టార్ నాని, నివేదా థామ‌స్‌, ఆది పినిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం నిన్నుకోరి. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా విడుద‌లైన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. త‌మిళంలో క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతుంది.

ఇక తెలుగులో బ్రేక‌ప్ ల‌వ‌ర్ పాత్ర‌ను పోషించిన నాని పాత్ర‌ను త‌మిళంలో అధ‌ర్వ చేస్తున్నారు. నివేదా థామ‌స్ పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించ‌నున్నారు. అయితే తెలుగులో ఆది పినిశెట్టి పాత్ర‌ను త‌మిళంలో ఎవ‌రు చేస్తార‌నే దానిపై క్లారిటీ రాలేదు. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ విషయమై అఫీషియల్ ప్రకటన రానుంది.