గాసిప్స్ : ఏంటి అఖిల్ తో పవన్ కం బ్యాక్ హిట్ సినిమా దర్శకుడు..?

Pawan Kalyan, Venu Sriram project may not be happened

ప్రస్తుతం అక్కినేని వారి యంగ్ హీరో అఖిల్ అక్కినేని భారీ చిత్రం “ఏజెంట్” లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కస్టపడుతుండగా అందుకు తగ్గట్టుగానే దర్శకుడు సురేందర్ రెడ్డి కూడ అపాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో ఈ సినిమాని తీస్తున్నాడు.

మరి చిన్న హీరోల్లో అయితే భారీ అంచనాలు నెలకొల్పుకున్న కొన్ని చిత్రాల్లో ఇది కాగా ఈ సినిమా తర్వాత అఖిల్ ఎవరితో సినిమా చేస్తాడో అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ లైనప్ లో అఖిల్ కోసం పవన్ దర్శకుడు రెడీగా ఉన్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు “వకీల్ సాబ్” సినిమాతో పవన్ కళ్యాణ్ కి భారీ కం బ్యాక్ ఇచ్చి పవన్ అభిమానుల పాలిట మాస్ గాడ్ అనిపించుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ అట. మరి కాంబోలో ఓ సినిమా పడుతుంది అని తెలుస్తుంది.

ఇంకా ఇందులో ఎంతవరకు నిజముందో తెలియరాలేదు కానీ ఈ టాక్ మంచి వైరల్ అవుతుంది. మరి ఈ కాంబోలో సినిమా పడుతుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.