రజినీకాంత్ లేటెస్ట్ సినిమా కోసం “అఖండ” ఈ ఫైట్ మాస్టర్ తో భారీ ప్లాన్.!

మాస్ సినిమాలు అన్నా మాస్ హీరోస్ అన్నా ఒళ్ళు గగుర్పొడిచే భారీ ఫైట్ సీక్వెన్స్ లు సినిమాల్లో ఉండాల్సిందే. అలాగే సినిమా సినిమాకి కూడా ఒకదాన్ని మించి ఇంకో ఫైట్ సీన్ తప్పక ఉండాల్సిందే. అలా మన దగ్గర అయితే నందమూరి బాలకృష్ణ సినిమాల్లో అదిరే ఫైట్ సీన్ లు పెడుతూ ఉంటారు.

అలా తన లాస్ట్ భారీ హిట్ సినిమా “అఖండ” లో మైండ్ బ్లాకింగ్ ఏక్షన్ సీన్ లు ముఖ్యంగా అఘోర బాలకృష్ణ పై కనిపిస్తాయి. అయితే ఈ సీన్స్ ని ప్రముఖ కొత్త ఫైట్ మాస్టర్ శివ కంపోజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫైట్ మాస్టర్ అండ్ టీం ఏకంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం రజినీ హీరోగా ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో “జైలర్” అనే భారీ ఏక్షన్ సినిమాని చేస్తున్నారు. మరి ఈ సినిమా కోసం అఖండ శివ ని ఫైట్ మాస్టర్ గా తీసుకోగా తాను ఇప్పుడు ఓ భారీ ఫైట్ సీన్ ని రజిని తో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.

దీనితో అయితే ఇప్పుడు ఈ టాక్ కోలీవుడ్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో అయితే తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది రమ్యకృష్ణ తదితరులు కీలక పత్రాలు చేస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.