రాంగోపాల్ వర్మ మెంటాలిటీ శిష్యులకు కూడా అంటుకున్నట్టు ఉంది. వర్మ మాటలే అర్ధం కావు అనుకుంటే అతని శిష్యులు కూడా అలానే మాట్లాడుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ శిష్యుడు, RX 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి రాంగోపాల్ వర్మను నీచుడుగా సంబోధించాడు.
చిన్న సినిమాగా వచ్చిన RX 100 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి ఫేమ్ తెచ్చి పెట్టింది. ఈ సినిమా గురించి రాంగోపాల్ వర్మ కూడా తన ట్విట్టర్లో అజయ్ భూపతిని అభినందిస్తూ ఒక పోస్టు కూడా పెట్టాడు. కానీ అజయ్ భూపతి మాత్రం తన గురువుని నీచుడు అనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకత్వంలో ఆయనను మించినవారు లేరు. కానీ ఎప్పుడూ ఏదొక వివాదాలు రాజేస్తూ ఉంటాడు. ఇతరులను గిల్లుతూ ఉంటాడు. దర్శకుడిగా ఆయన నాకు దేవుడితో సమానం కానీ ఒక వ్యక్తిగా ఆయన చాలా నీచుడు అని అజయ్ అనటం చర్చనీయాంశం అయింది.
రాంగోపాల్ వర్మ లాంటివారిని కిడ్నాప్ చేసి, కాళ్ళు చేతులు కట్టేసి, కళ్ళకు క్లిప్పులు పెట్టి వరుసగా ఫ్యామిలీ సినిమాలు చూపించాలని అన్నాడు. అప్పుడే ఆయనలో మార్పు వస్తుందని తెలిపాడు. అంతేకాదు ఒకవేళ దర్శకుడి మీద బయోపిక్ తీయాల్సి వస్తే వర్మ గురించే తీస్తాను అని చెప్పాడు. దర్శకుడిగా ఆయన గొప్పతనం, వ్యక్తిగా ఆయన నీచత్వం రెండూ చూపిస్తానని వ్యక్తం చేసాడు అజయ్ భూపతి. ఏది అనిపిస్తే అది మాట్లాడే రాంగోపాల్ వర్మ శిష్యుడు, వర్మ గురించి తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా మాట్లాడి గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు.