డిఫరెంట్ టేస్ట్ గురూ: ‘ఫస్ట్ లుక్’ లో టాయిలెట్ టబ్ పై హీరో..

చిన్న సినిమాలు హిట్ అయితే ఓ బెనిఫిట్ ఉంది. మరిన్ని చిన్న సినిమాలు వచ్చేందుకు దారి ఏర్పడుతుంది. చాలా మందికి పని దొరుకుతుంది. అదే సమయంలో కొత్త దర్శకులు, హీరోలు తమ ప్రతిభను చూపించుకునేందుకు ఓ వేదిక ఏర్పడుతుంది. అదే స్టార్ హీరోలు తో చేసే పెద్ద సినిమాలలో ఈ అవకాసం ఉండదు. కొత్తవారితో కోట్లు పోయటానికి ఇష్టపడరు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే …

సుమంత్ హీరోగా కొత్త దర్శకుడుని పరిచయం చేస్తూ వచ్చిన ‘మ‌ళ్ళీరావా’ మంచి హిట్ అయ్యింది. అలాంటి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ను అందించిన నిర్మాణ సంస్థ స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇప్పుడు రెండో చిత్రానికి సిద్దపడుతోంది. తొలి సినిమాతోనే క‌థాబ‌లం ఉన్న చిత్రాన్ని ఎంచుకుని త‌న ప్రత్యేక‌తను చాటుకున్న నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా రెండో సినిమాకు అదే దారిలో వెళ్తున్నారు. ఈ సంస్థ నుంచి రెండో ప్రయ‌త్నంగా మ‌రో సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ దీపావళి కానుకగా రిలీజ్‌ య్యింది. స్వరూప్ ఆర్ఎస్ జే ను దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్‌ ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’.

యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టించిన ఆల్ ఇండియా బ‌క్చోద్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న న‌వీన్ పొలిశెట్టి ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు. అలాగే శృతి శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు .

‘అ!’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న మార్క్ కె రాబిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే సినిమా కాన్సెప్ట్‌ను రివీల్ చేశారు. హీరో నెల్లురూ కు చెందిన ప్రైవేట్ డిటెక్టివ్‌ అని అర్థమవుతోంది. పోస్టర్ డిజైన్‌ చేసిన విధానం,

ఈ ఫస్ట్ లుక్ లో టాయిలెట్ టబ్ పై కూర్చుని టాబ్లాయిడ్ ని చూస్తున్నాడు హీరో. ఆ పేపర్ పై `ఎఫ్బీఐ నెల్లూర్` అని రాసి ఉంది.

నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ… థ్రిల్లర్ నేపథ్య కథాంశమిది. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. మా సంస్థ నిర్మించిన తొలిచిత్రం మళ్లీరావా ఎంతో పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా కూడా మంచి గుర్తింపును తెస్తుందనే నమ్మకముంది అన్నారు.

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: స్వరూప్ ఆర్.ఎస్.జే, నవీన్ పొలిశెట్టి, కెమెరా: సన్నీ కురపాటి, సంగీతం: మార్క్ క్రోబిన్, ఆర్ట్: క్రాంతి ప్రియం, కథ, దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జే.